Thursday, December 7, 2023

భారతీయ సైనికులు దేశం విడిచి వెళ్లాలి: మాల్దీవుల అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

మాలె : భారతీయ సైనికులు తమ దేశం విడిచి వెళ్లాలని హిందూ మహాసముద్రంలో ద్వీప దేశం మాల్దీవులు కోరింది. ఇటీవల చైనాకు మద్దతు పలుకుతూ, ఇండియాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు అక్కడి ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడు కాబోతున్నారు. మాల్దీవులు పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని భావిస్తోందని, దేశంలో ఉన్న భారతీయ సైనికులు విడిచి వెళ్లాలని మయిజ్జు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మయిజ్జు తాను గెలిస్తే మాల్దీవుల్లో భారత దళాలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇజ్రహీం సోలిహ్ దేశ సార్వభౌమాధికారాన్ని ఇండియాకు తాకట్టు పెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా బ్లూమ్ బర్గ్ టవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారతీయ సైనికులే కాదు, మరే ఇతర దేశాలకు చెందిన సైనికులు తమ దేశంలో ఉన్నా స్పందన ఇలాగే ఉంటుందని అన్నారు. మాల్దీవుల్లో ప్రస్తుతం 70 మంది భారతీయ సైనిక సిబ్బంది ఇండియా ఇచ్చిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నారు. భారత యుద్ధనౌకలు మాల్దీవుల్లోని ప్రత్యేక ఆర్థిక జోన్ లో గస్తీకి సాయపడుతున్నాయి. సైనిక ఉనికిని తొలగించేందుకు ఇప్పటికే తాను చర్చల్ని ప్రారంభించానని మయిజ్జు తెలిపారు. భారతీయ సైనికుల స్థానంలో ఇతర దేశాల సైనికులు ఇక్కడికి రారని, చైనా లేదా మరేదైనా దేశానికి చెందిన సైనికులను అనుమతించబోమన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News