Monday, May 13, 2024

2024లో భారత్ గగన్‌యాన్: జితేంద్ర సింగ్

- Advertisement -
- Advertisement -

India's Gaganyaan likely to launch in 2024: Jitendra Singh

న్యూఢిల్లీ: భారత్ చేపట్టే తొలి మానవ సహిత అంతరిక్షయాత్ర గగన్‌యాన్ 2024లో ప్రారంభం కావచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం వెల్లడించారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా 2022 నాటికే ఈ యాత్రను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నా కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడిందని పాత్రికేయులకు చెప్పారు. ఈమేరకు రష్యా, భారత్‌లో శిక్షణ పొందుతున్న వ్యోమగాములకు కొవిడ్ తీవ్ర ప్రతిబంధకమైందన్నారు. వచ్చే ఏడాది చేపట్టనున్న ఈ అంతరిక్షయాత్రలో స్త్రీ ఆకృతిలో తయారయ్యే రోబో “వ్యోమ్‌మిత్ర”ను అంతరిక్షానికి పంపడమౌతుందని మంత్రి తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించి నలుగురు పోరాట యోధులైన పైలట్లను వైమానిక దళం గుర్తించిందని, ఈ వ్యోమగాములు రష్యాలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. రెండు కక్ష పరీక్షల ఫలితాల బట్టి దిగువ భూ కక్షకు ఇద్దరు వ్యోమగాములను 2024లో ఇస్రో పంపిస్తుందని మంత్రి వివరించారు.

India’s Gaganyaan likely to launch in 2024: Jitendra Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News