Friday, April 26, 2024

వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్‌టికెట్లు

- Advertisement -
- Advertisement -

Intermediate hall tickets

 

హైదరాబాద్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల హాల్‌టికెట్లను శుక్రవారం వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. విద్యార్థులు నేరుగా తమ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. అలాగే విద్యార్థులు సులువుగా పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి అందుబాటులోకి తీసుకువచ్చిన ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ యాప్‌లో శుక్రవారం నుంచి విద్యార్థుల వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. ఈ యాప్‌లో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే పరీక్షా కేంద్రం ఫొటోతోపాటు ఆ కేంద్రానికి వెళ్లే మ్యాప్ వస్తుంది. విద్యార్థుల ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి ఎంత దూరం ఉంది..?, ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చు అనే వివరాలు కూడా వస్తాయి.

విద్యార్థులు www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఈ సారి 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. గత ఏడాది ఇంటర్ ఫలితాలలో కొంతమంది విద్యార్థి పేరు, తండ్రి, తల్లి పేర్లు, గ్రూపు, మాధ్యమం, ద్వితీయ భాష, పిహెచ్ కేటగిరీ, పరీక్ష రాసే సబ్జెక్టులు, చెల్లించిన పరీక్ష ఫీజు వివరాలలో తప్పులు దొర్లిన నేపథ్యంలో ఈ సారి ముందుగానే ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో విద్యార్థుల అందుబాటులో ఉంచి వారి వివరాలు సరిచూసుకునేందుకు అవకాశం కల్పించింది.

Intermediate hall tickets on Website
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News