Sunday, May 5, 2024

ఇంటర్ ఒకేషనల్ విద్యలో మార్పులు

- Advertisement -
- Advertisement -

Intermediate Vocational Education Changes in Telangana

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వృత్తి విద్యా (ఒకేషనల్) కోర్సులను పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా, సత్వర ఉపాధి అందించే విధంగా తీర్చిదిద్దేలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇంటర్ విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాలు పెంచాలనే ఆలోచనలకు అనుగుణంగా వృత్తి విద్యా కోర్సులు, వాటి సిలబస్‌లో మార్పులు చేయనున్నారు. ఇంటర్మీడియెట్ స్థాయిలో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్న వృత్తి విద్యా కోర్సులను బలోపేతం చేసేందుకు ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు.

ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థులు వారి చదువులను పూర్తి చేసుకోవడంతోనే ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నారు. ఈ క్రమంలో ఆటోమొబైల్ సర్వీసింగ్, మోటారు వైండింగ్ కమ్ ఎలక్ట్రీషియన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, టాయ్స్ మేకింగ్, అర్బన్ మైక్రో బిజినెస్, సోలార్ ఎనర్జీ వంటి అనేక కోర్సులను రాష్ట్రంలోని ఇంటర్ ఒకేషనల్ కోర్సులుగా అమల్లోకి తీసుకువచ్చే దిశగా ఇంటర్మీయట్ విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఒకేషనల్ కోర్సు చేసే విద్యార్థి ఉద్యోగంలో లేదా సొంతంగా ఉపాధి పొందేలా ఉండాలన్న లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న కోర్సుల్లో మార్పులను తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఇలాంటి కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

మళ్లీ అప్రెంటిస్‌షిప్ విధానం

ఇంటర్‌మీడియట్ వృత్తివిద్య కోర్సుల విద్యార్థులకు నాలుగేళ్ల క్రితం ఆగిపోయిన అప్రెంటిస్‌షిప్ విధానం మళ్లీ అమల్లోకి వచ్చింది. దీనివల్ల వృత్తివిద్య కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఆసుపత్రులు ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్ సౌకర్యం కల్పిస్తాయి. స్టైఫండ్‌గా నెలకు రూ.7 వేల చొప్పున విద్యార్థులకు చెల్లిస్తాయి. గతంలో నేషనల్ అప్రెంటిస్‌షిప్ బోర్డు ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించేది. నాలుగేళ్ల నుంచి దాన్ని తొలగించారు.

అప్పటి నుంచి ఈ సౌకర్యం దూరమైంది. ఈ ఏడాది అమలు బాధ్యత కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖకు కేంద్రం అప్పగించింది. ఈ క్రమంలో నైపుణ్యాభివృద్ధి ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంతో కలిసి ఇంటర్ విద్యాశాఖ గతంలో ఆసుపత్రుల ప్రతినిధులతో వర్క్‌షాప్ నిర్వహించారు. ఇంటర్ వృత్తివిద్య కోర్సులైన మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్, ఫార్మా టెక్నాలజీ కోర్సులు పూర్తిచేసిన వారికి అప్రెంటిస్‌షిప్ ఇస్తామని ఆసుపత్రుల ప్రతినిధులు అంగీకరించారు.

Intermediate Vocational Education Changes in Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News