Sunday, April 28, 2024

నన్ను నేను కొత్తగా మలుచుకున్నా

- Advertisement -
- Advertisement -

Nagasurya

 

నాగశౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘అశ్వథ్థామ’. మెహరీన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో ఇంటర్వూ విశేషాలు…

సీరియస్, ఎమోషనల్ ఫిల్మ్…
నా కెరీర్‌లో ఇప్పటివరకు ఈ స్థాయి సీరియస్, ఎమోషనల్ ఫిల్మ్ చేయలేదు. సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అవుట్‌ఫుట్ పట్ల మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది.

ప్రతి పాత్రకు ప్రాధాన్యత…
ఈ సినిమాలో ప్రతి పాత్ర కీలకమైనదే. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా విలన్ రోల్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే నా రోల్ కూడా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

అందరూ కొత్తవాళ్లే…
మా డైరెక్టర్, మా కెమెరామెన్ దగ్గర నుండి ఈ సినిమాకి పని చేసిన అందరూ కొత్తవాళ్లే. టాలెంట్ ఉన్నప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వకపోతే అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే నేను కొత్తగా వచ్చినప్పుడు సాయి కొర్రపాటి, అవసరాల శ్రీనివాస్ నాకు ఛాన్స్ ఇచ్చారు. టాలెంట్ ఉన్న వాళ్లందరికీ అవకాశాలు రావాలి.

అందులో జోక్యం చేసుకోలేదు…
ఈ సినిమాకు కథ రాసినప్పటికీ డైరెక్షన్ చేద్దామనే ఆలోచన అయితే ఇప్పటివరకు నాకు రాలేదు. ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా లేదు. నేను సెట్‌లో కూడా డైరెక్షన్‌కి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అయితే షూట్‌కి వెళ్లకముందే ప్రతి షాట్ గురించి చర్చించాం.

బోర్ కొట్టేసింది…
ఇప్పటికే చాలా లవ్ స్టోరీస్ చేసి చేసి బోర్ కొట్టేసింది. అదే పాత ప్రేమకథలు చేయాలనిపించట్లేదు. దానికంటే కూడా నేను ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకోవాలనుకుంటున్నాను. నటుడిగా నేను ఎదగాలని చేసిన ప్రయత్నం ‘అశ్వథ్థామ’. ఈ సినిమాతో నన్ను నేను కొత్తగా మలుచుకున్నాను.

తదుపరి చిత్రాలు…
నా ప్రొడక్షన్ హౌస్‌లోనే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం నేను ఒక కొత్త లవ్ స్టోరీ కూడా రాస్తున్నాను. అయితే ఆ లవ్ స్టోరీతో మా బ్యానర్‌లో ఒక కొత్త హీరోతో సినిమా రూపొందించాలని ఆలోచిస్తున్నాము.

Interview with Hero Naga Shourya
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News