Wednesday, May 15, 2024

ముంబైకి ఢిల్లీ షాక్

- Advertisement -
- Advertisement -

అమిత్ మిశ్రా మ్యాజిక్.. ముంబైకి ఢిల్లీ షాక్
రాణించిన ధావన్, స్మిత్, పంత్ సేనకు మూడో గెలుపు

చెన్నై: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఐదు బంతులు మిగిలివుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పృథ్వీషా ఏడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే తర్వాత విచ్చిన స్టీవ్ స్మిత్‌తో కలిసి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ జట్టును పటిష్టస్థితికి చేర్చారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 4 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. మరోవైపు సమన్వయంతో బ్యాటింగ్ చేసిన ధావన్ ఐదు ఫోర్లు, సిక్స్‌తో 45 పరుగులు సాధించాడు. ఇక లలిత్ యాదవ్ 22 (నాటౌట్), హెట్‌మెయిర్ 14 (నాటౌట్) మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.
ఆదుకున్న రోహిత్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబైఇకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (1)ను స్టోయినిస్ వెనక్కి పంపాడు. అప్పటికీ ముంబై స్కోరు 9 పరుగులు మాత్రమే. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరు కలిసి ఢిల్లీ బౌలర్లను జాగ్రత్తగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. సూర్యకుమార్ దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. రోహిత్ కూడా తన మార్క్ షాట్లతో అలరించాడు. ఇద్దరు ధాటిగా ఆడడంతో ముంబై స్కోరు 7 ఓవర్లలోనే 67 పరుగులకు చేరింది. కానీ కుదురుగా ఆడుతున్న సూర్యకుమార్‌ను అవేశ్ ఖాన్ వెనక్కి పంపాడు. సూర్యకుమార్ 4 ఫోర్లతో వేగంగా 24 పరుగులు చేశాడు. ఆ వెంటనే రోహిత్ కూడా ఔటయ్యాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 30 బంతుల్లో మూడు సిక్సర్లు, మరో 3 ఫోర్లతో 44 సాధించాడు. ఈ వికెట్‌ను అమిత్‌షా పడగొట్టాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య నిరాశ పరిచాడు. అతను ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కృనాల్ పాండ్య (1) కూడా వెనుదిరిగాడు. లలిత్ యాదవ్ అద్భుత బంతితో అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కీరన్ పొలార్డ్ కూడా విఫలమయ్యాడు. రెండు పరుగులు మాత్రమే చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక సమన్వయంతో ఆడిన ఇషాన్ కిషన్ 26 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అతన్ని కూడా అమిత్ వెనక్కి పంపాడు. ఇక జయంత్ యాదవ్(23) మినహా మిగతావారు విఫలం కావడంతో ముంబై స్కోరు 137 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో మిశ్రా 24 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్‌కు రెండు వికెట్లు లభించాయి.

IPL 2021: DC Win by 6 wicket against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News