Saturday, April 27, 2024

అద్భుతం..అమోఘం

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు ‘మహాద్భుతం.. పంజాబ్ ముఖ్యమంత్రి భ గవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. ఈ పథకాలు దేశానికే రోల్ ఉన్నాయన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అనుసరిస్తున్న విజన్ ప్రతి రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలువనుందన్నారు. ఎత్తిపోత ల పథకాలకు కాళేశ్వర ప్రాజెక్టు ఒక ఐకాన్ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మో డల్‌ని అనుసరించి పంజాబ్‌లో కూడా చెక్ డ్యా ములు విరివిగా నిర్మించి జల సంపదను భవిష్య త్తు తరాలకు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా నదీజలాలను సమర్థవంతంగా వినియోగించుకునే తెలంగాణ కాలువ ఆధారిత నీ టి పారుదల వ్యవస్థను పంజాబ్‌లోనూ పునరావృ తం చేస్తామన్నారు.తెలంగాణలోని భూగర్భ జలా ల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు ఒ కరోజు పర్యటనకు వచ్చిన భగవంత్‌సింగ్ మాన్ నేతృత్వంలోని అధికారుల బృందం కాళేశ్వరం ఎ త్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ను, కొండపోచమ్మ పంప్‌హౌస్‌ను, ఎ ర్రవల్లిలోని చెక్ చివరిగా గజ్వేల్ పట్నంలోని పాండవుల చెరువును సందర్శించింది. ముం దుగా కొండపోచమ్మ సాగర్‌తో పాటు గజ్వేల్‌లోని పాండవుల చెరువును పరిశీలించింది.

ఈ పథకాలను చూసి మాన్ బృందం తెలంగాణలో సాగునీటిపథకాలు చాలా బాగున్నాయని వ్యాఖ్యానించింది. కాగా మాన్ బృందానికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్‌తో నీటిపారుదలశాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ప్రాజెక్టు నిర్మాణం తీరు, వివిధ దశలను వివరించారు. ప్రధానంగా కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు, రాష్ట్రాభివృద్ధిలో ప్రాధాన్యత, దాని నిర్మాణం, నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను వివరించారు.రాష్ట్రంలో చేపట్టిన జలవనరుల పథకాలను మ్యాప్‌లు, చార్జులతో వివరించారు. ఈ సందర్భంగా భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు నాలెడ్జ్ షేరింగ్ లో భాగంగా కాలేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి రావడం జరిగిందన్నారు. 500 మీటర్ల పైకి గోదావరి నీటిని కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకువచ్చి మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం ఆదర్శనీయమని అన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణలో వ్యవసాయ రంగంతో పాటు నీటిపారుదల, పారిశ్రామిక, వైద్య, ఆరోగ్యం తదితర అన్ని రంగాలలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందన్నారు.

సిఎం కెసిఆర్ గొప్ప దార్శనికుడన్నారు. రాష్ట్రంలో నిర్మించిన రిజర్వాయర్లు, చెక్ డాములు భూగర్భ జలాల పెంపునకు అత్యధికంగా ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు దాదాపు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వ అధ్యయనాల్లో తేలిందన్నారు. కాగా తమ (పంజాబ్) రాష్ట్రంలో 1947 ముందు నుంచే నీటిపారుదల, వ్యవసారంగాలు అభివృద్ధి సాధించాయన్నారు. పంజాబ్ అంటేనే ఐదు నదుల సంగమం అని భగవంత్ సింగ్ మాన్ అన్నారు. భాక్రానంగల్ లాంటి గొప్ప ప్రాజెక్టులతో పంజాబ్ దేశంలోనే ఆహార ఉత్పత్తిలో ప్రథమంగా ఉండేదన్నారు. కానీ భూగర్భ నీటి వనరులను అధికంగా ఉపయోగించడం మూలంగా ప్రస్తుతం పంజాబ్‌లోని కొన్ని జిల్లాలో భూగర్భ నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంజాబ్ లో 80శాతం భూగర్భ నీటి లభ్యతలో డార్క్ జోన్‌లో ఉందన్నారు. భూగర్భ నీటి వనరులను కాపాడేందుకు క్రాఫ్ట్ డైవర్షన్ పద్ధతిని అనుసరిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో గల పాతకాలం నాటి నీటిపారుదల వ్యవస్థను తెలంగాణలో మాదిరిగానే పూర్తిగా ఆధుకీకరించి భూగర్భ జలాలను పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు.

కాగా పంజాబ్ రాష్ట్రంలో మార్చి నెలలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నామని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా భగవంత్‌సింగ్ మాన్ అన్నారు. ఈ బడ్జెట్‌లో నీటిపారుదల, పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. పంజాబ్ రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు దేశ రక్షణలో యువత భాగస్వామ్యం అధికంగా ఉందన్నారు. ప్రపంచంలో 80 శాతం శాతం బాస్మతి రైస్ పంజాబ్‌లోనే పండుతుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన పంజాబ్‌ను మళ్లీ ప్రాచీన కాలంనాటి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. దుబాయ్, సౌదీ అరేబియాలో ప్రజలు చమురు కోసం తవ్వినట్లుగా, పంజాబ్‌లో నీటి కోసం అంత లోతుగా బోర్‌వెల్‌లు తవ్విస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం మూలంగా రైతులు నష్టపోతున్నారని భగవంత్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో కెసిఆర్‌లు విద్యా, వైద్యం తదితర రంగాలలో అమలు చేస్తున్న వినూత్న పథకాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకర్షిస్తున్నాయన్నారు.అందువల్ల పంజాబ్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. పంజాబ్‌లో 14 లక్షలకు పైగా గొట్టపు బావులు ఉన్నాయని, రాష్ట్రంలో సరస్సు-నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులతో ముచ్చటించిన మాన్
ండవుల చెరువు వద్ద రైతులతో ముచ్చటించిన మాన్….. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల జీవితాలు ఎలా మారాయని ఆరా తీశారు. మిషన్ కాకతీయకు ముందు, తర్వాత తన వైఖరిని మాన్‌కు ఈ సందర్భంగా పోచయ్య అనే రైతు వివరించారు. పోచయ్య మాట్లాడుతూ… తనకున్న రెండెకరాల భూమిని ఆదర్శంగా ఉంచుకున్నానని, నీటి కొరతతో వ్యవసాయాన్ని వదిలేశానన్నారు. మిషన్ కాకతీయ తర్వాత చెరువులు పునరుజ్జీవం, కుంటల విస్తరణ, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. బోర్‌వెల్‌లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండడంతో రైతు ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడి ఒక పంట వరి, మూడు పంటలు పండిస్తున్నానని ఏడాదికి 2 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని మాన్‌కు వివరించారు. ఈ పరివర్తనను తాను ఊహించలేదని రైతు తెలిపారు. తన జీవితంలో అందడంతో తమ ఆదాయం బాగా పెరిగిందని రైతులు బదులిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అనేక రిజర్వాయర్లను నిర్మించడంతో భూగర్భజలాలు కూడా గణనీయంగా మెరుగుపడ్డాయని రైతులు మాన్‌కు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News