Tuesday, May 7, 2024

వైఎస్‌ హయంలో 20లక్షల ఎకరాలుక సాగునీరు షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ ప్రాంతంలో జలయజ్ణం కింద నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే 20లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం పలు పథకాల నిర్మాణాలు చేపట్టిందని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.మంగళవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ పడావుబడ్డ బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత వైఎస్‌దే అన్నారు. నాడు జలయజ్ఞం కింద వేసిన పునాదులే..నేడు కెసిఆర్ చెప్తున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు అని తెలిపారు. కల్వకుర్తి ద్వారా 4 లక్షల ఎకరాలు, భీమా కింద 2 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 60 వేల ఎకరాలు, గట్టు, తుమ్మిల్ల, సంగంబండ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రిజర్వాయర్లు ఉన్నాయన్నారు.వైఎస్‌ఆర్ బ్రతికి ఉంటే పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయ్యేదని, 10 లక్షల ఎకరాలకు ఏనాడో సాగునీరు అందేదని షర్మిల పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News