Wednesday, April 24, 2024

ఇషా అంబానీ నివాసంలో ‘రోమన్ హోలీ’ సంబరాలు.. మెరిసిన తారలు

- Advertisement -
- Advertisement -

ముంబై (మహారాష్ట్ర): రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ, బల్గారి సిఈవో జీన్ క్రిస్టోఫ్ బాబిన్ శుక్రవారం సాయంత్రం ఇషా అంబానీ నివాసంలో ‘రోమన్ హోలీ’ బాష్‌ను నిర్వహించారు. డిజైనర్ అశ్విన్ త్యాగరాజన్ బనారసీ ఫ్లోర్ లెంగ్త్ గౌను ధరించారు ఇషా అంబానీ. ముంబై శుక్రవారం రాత్రి గ్లామర్, సంప్రదాయాల సంగమాన్ని తలపించింది. ఈ కార్యక్రమాన్ని లగ్జరీ బ్రాండ్ బల్గారీ సహ-ఆర్గనైజ్ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్‌ నుంచి ప్రియాంక చోప్రా, ఈషా , మాధురీ దీక్షిత్, శిల్పా శెట్టి ఈ ఈవెంట్‌ కు హాజరయ్యారు. ఇషా, శ్లోకా మెహతా (ఆకాష్ అంబానీ భార్య), రాధిక మర్చంట్ (అనంత్ అంబానీకి కాబోయే భార్య)తో ప్రియాంక స్పాట్‌లైట్‌ను పంచుకున్న క్లిప్‌ను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పిక్స్ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News