Sunday, April 28, 2024

ఇజ్రాయెల్‌లో తొలి ఒమిక్రాన్ మరణం

- Advertisement -
- Advertisement -

Israel Reports First Omicron Death Case

జెరూసలెం: ప్రపంచ దేశాల్లో వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌తో మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇజ్రాయెల్ లోనూ తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. బీర్షెబా నగరంలో కొత్త వేరియంట్ వల్ల 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఒమిక్రాన్ బాధితుడైన ఆ వ్యక్తి కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూఏ మంగళవారం మరణించాడు. ఇదిలా ఉండగా ఒమిక్రాన్ కట్టడికి మరో బూస్టర్ డోసు అంటే నాలుగో డోసు పంపిణీ కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారికి నాలుగో డోసు ఇవ్వాలని ఆ దేశ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులకు స్పందించిన ప్రధాని నఫ్తాలి బెన్నెట్ అర్హులైన వారంతా నాలుగో డోసు వేయించుకోవాలని కోరారు. అయితే దీనిపై దేశ ఆరోగ్యశాఖ నుంచి ఇంకా అధికారిక అనుమతులు ఇంకా రాలేదు. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 350 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఈ వేరియంట్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది.

Israel Reports First Omicron Death Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News