Sunday, April 28, 2024

ముగ్గురు బందీలను కాల్చి చంపిన ఇజ్రాయెల్ సైన్యం

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్: హమాస్ అంతమే లక్షంగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంపై భీకర దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఉగ్ర వాదులుగా భావించి హమాస్ చెరలో ఉన్న ముగ్గురు వ్యక్తులను ఇజ్రాయెల్ సైన్యం (ఐడిఎఫ్) పొరబాటున కాల్చి చంపింది. ఈ విషయాన్ని ఐడిఎఫ్ స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేసింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అంతులేని విషాదంగా అభివర్ణించారు.‘ మన ముగ్గురు బందీల మృతితో నేను కూడా దుఃఖంతో తలవంచుకుంటున్నాను.ఈ వార్త తెలిసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలంతా దుఃఖంలో మునిగిపోయారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాల గురించే నా ఆలోచనంతా. తమ ప్రాణాలను పణంగా పెట్టి బందీల విడుదల కోసం పోరాడుతున్న మన సైనికులు ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకొంటున్నా. ఇలాంటి పరిస్థితుల్లో బందీలను సురక్షితంగా తీసుకు వచ్చేందుకు గాయాలు కనిపించకుండా ,

పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం’ అని నెతన్యాహు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మృతి చెందిన వారిలో ఒకరు ఇజ్రాయెల్‌లోని కెఫార్ ప్రాంతానికి చెందిన యోటమ్ హైమ్ కాగా, మరొకరు కిబుట్జ్ నిర్ అమ్ ప్రాంతానికి చెందిన వారిగాగుర్తించారు. మూడో వ్యక్తి వివరాలను అతని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గోప్యంగా ఉంచారు. గాజాలో యుద్ధం ఆపాలని అంతర్జాతీయ సంస్థలు, కనీసం మానవతా సాయం అందేందుకు వీలుగా యుద్ధం తీవ్రతను తగ్గించాలని అమెరికా సహా పలు దేశాలు ఇజ్రాయెల్‌ను కోరుతున్నాయి. ఈ క్రమంలో బందీల మృతి ఘటన ఇజ్రాయెల్‌ను మరింత ఒత్తిడికి గురి చేస్తోంది. దీంతో బందీల విడుదలపై ఖతర్ ప్రధానితో చర్చలు జరపడానికి ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ చీఫ్ డేవిడ్ బర్నియాను యూరప్‌కు నెతన్యాహు పంపించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.

ఇజ్రాల్ క్షిపణి దాడుల్లో పలువురు పాలస్తీనియన్లు మృతి?
ఇదిలా ఉండగా శనివారం గాజాలోని జబాలియా ప్రాంతంలోని పాత గాజా స్ట్రీట్‌లో ఉన్న రెండు ఇళ్లపై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో కనీసం 14 మంది పాలస్తీనియన్లు చనిపోగా, పలువురు పౌరులు భవన శిథిలాల కింద చిక్కుపడ్డారని పాలస్తీనా మీడియా తెలిపింది. కాగా ఖాన్ యూనిస్‌లో రెండు స్కూళ్లలో దాగి ఉన్న హమాస్ మిలిటెంట్లను హతమార్చామని, ఆయుధాలు నిల్వ చేసిన అపార్ట్‌మెంట్లపై దాడి చేసినటు ్లఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News