Monday, September 22, 2025

జడ్చర్లలో కారు డివైడర్ ను ఢీకొట్టి.. మరో కారుపై పడింది: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై రాజాపూర్ వద్ద రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో జారుకోవడంతో కారు డివైడర్ ను ఢీకొని అనంతరం మరో కారుపై ఎగిరిపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు వనపర్తి ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

Also Read: మమ్మల్ని ఎడబాపినోళ్ల భరతం పడతా.. కవిత సంచలన కామెంట్స్

Jadcharla Mahabubnagar Jadcharla Mahabubnagar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News