Sunday, April 28, 2024

జగ్గారెడ్డి అలక

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు సోనియా, రాహుల్ గాంధీలకు లేఖ

ఆ క్షణం నుంచి తాను పార్టీలో
లేనట్లేనని మీడియాతో భేటీలో
ప్రకటన సడన్‌గా వచ్చి
లాబీయింగ్ చేస్తే ఎవరైనా
పిసిసి అధ్యక్షులు కావొచ్చంటూ
రేవంత్ రెడ్డిపై ధ్వజం తనపై
కోవర్టు ఆరోపణ
చేస్తున్నారంటూ ఆవేదన
త్వరలో పిసిసి వర్కింగ్
ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్‌కు
రాజీనామా చేస్తానని వెల్లడి
జగ్గారెడ్డితో ఉత్తమ్‌కుమార్ భేటీ
పాల్గొన్న గీతారెడ్డి
సమస్యలుంటే ఢిల్లీకి వెళ్లి
పరిష్కరించుకుందామంటూ
బుజ్జగింపు చక్కదిద్దుకుంటాం : రేవంత్

Jaggareddy will resigned congress party

మన తెలంగాణ/హైదరాబాద్: నుంచి వెళ్లిపోగానే కొత్త పార్టీ పెట్టడం ఖాయమని టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి శనివారం సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కోవర్టులో అధిష్టానం గు ర్తించాలని సూచించారు. కాంగ్రెస్‌లో జరుగుతు న్న అవమానాలు భరించేకనే రాజీనామా చేసి ప్ర జల్లో స్వతంత్రంగా సేవ చేస్తానని ఆయన చెప్పా రు. కాంగ్రస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపి రాహుల్‌గాంధీలకు లేఖలు రాసిన తర్వాత ఆయ న జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆ పార్టీకే తానే ప్రెసిడెంట్.. తానే ఎంఎల్‌ఎ, తానే ఫ్లోర్ లీడర్ అని తెలిపారు. త్వర లో పార్టీ పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వా నికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

కాంగ్రెస్ లో సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేసి పిసిసి చీఫ్ కావొచ్చని లేఖలో పేర్కొన్నారు. సొంత పార్టీలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ కోవర్టుగా ముద్ర వేస్తు న్నారని, పార్టీలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కోవర్ట్ అని.. కొందరు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ వివాదాలు ఉన్నా హుందాగా ఉండేదని, ఇప్పుడు లేదని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎందుకు పోటీ పెట్టలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ లో ఎంతోమంది భీష్ములు, ధుర్యోధనులు, అర్జును లు వున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక ఎంఎల్ ఎ, మంత్రిని, సిఎంను కలిస్తే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బయటివాళ్లు ఎవరైనా విమర్శిస్తే స రే కానీ, సొంత పార్టీ వాళ్లే విమర్శిస్తారా? అని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల కో సం మంత్రులతో మాట్లాడితే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇండిపెండెంట్‌గా ఉంటే తాను ఎవ రినైనా కలవొచ్చని  ఇండిపెండెంట్‌గా వున్నప్పుడు అసలు రాజకీయం ఏందో చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తన స్వభావమన్నారు.

ఏ రాజకీయ పార్టీలో అయినా లొసుగులు, అంతర్గత కలహాలు ఉంటాయని జగ్గారెడ్డి చెప్పారు. తాను కరెక్ట్‌గా ఉన్నా కాబట్టే.. కరెక్ట్ ప్రశ్నలు అడుగుతున్నానని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి సిస్టమ్‌కు నష్టం చేస్టుంటే.. నష్టం చేస్తున్నాడనే చెబుతానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాను ఎవరికీ భయపడేది లేదని.. ఎవరికి జంకేది లేదన్నారు. తాను స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతానని జగ్గారెడ్డి తెలిపారు.కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాలనే లైన్ తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యం కాదని, తాను పార్టీలో వుండి ఎందుకు ఇబ్బంది పడాలి, కాంగ్రెస్‌ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తన తీరువల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చని.. అందుకే తాను పార్టీ నుంచి దూరం కావాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే నిక్కచ్చిగా మాట్లాడానని.. జగ్గారెడ్డి వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని కాంగ్రెస్‌లో ఒక వర్గం ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. జగ్గారెడ్డి పార్టీకి నష్టం చేస్తున్నారనే అపవాదు తనకు ఇష్టం లేదని.. రాహుల్‌పై అసోం సిఎం వ్యాఖ్యల్ని రాజకీయాలకు అతీతంగా కెసిఆర్ ఖండించారని ఆయన గుర్తు చేశారు.

తాను పోవాలని అనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవడం వల్ల తనకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. రోజూ ఈ న్యూసెన్స్ పెట్టుకోవడం ఎందుకని తానే వెళ్లిపోతున్నానని జగ్గారెడ్డి చెప్పారు. మూడు, నాలుగు రోజుల టైమ్ తీసుకుని ఆలోచించుకోమని సీనియర్లు విహెచ్, దామోదర రాజనర్సింహా, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి లాంటి నేతలు చెప్పారని ఆయన వెల్లడించారు. తాను మూడు, నాలుగు రోజుల సమయం తీసుకున్నా రాజీనామాపై వెనక్కి తగ్గనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీనియర్లకు వివరించడానికి కొంత సమయం తీసుకుంటున్నాననని.. శనివారమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, కాస్త ఆగానని ఆయన పేర్కొన్నారు. తాను స్వతంత్రంగా రాజకీయాల్లోకి వచ్చానని, అలాగే ఉంటానని స్పష్టం చేశారు. తనకు బ్యానర్ అవసరం లేదని, తానే ఒక బ్యానర్ అని చెప్పారు. తాను పార్టీ వీడినా కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు. 2017లో ఎవ్వరూ అధినేత రాహుల్‌గాంధీ సభ పెట్టడానికి ముందుకు రాకుంటే తాను కోట్లు ఖర్చుపెట్టి సభ నిర్వహించానని.. ఆ సభ నుండి పార్టీ రాష్ట్రంలో బలపడింది… పార్టీ కోసం కష్టపడిన తాన కోవర్టుని.. సభను నిర్వహించకుండా ఉన్న నేతలా కోవర్టులు? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

ఎవరు కోవర్టులు?

ఇటీవల పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో పార్టీ నుండి ఎవ్వరు అభ్యర్థులు పెట్టకుంటే తాను మెదక్ జిల్లా నుంచి అభ్యర్థిని నిలబెట్టానన్నారు. కోట్లు ఖర్చు పెట్టి పార్టీకి ఒక్క ఓటు తగ్గకుండా పరువు నిలిపానని ఆయన తెలిపారు. పార్టీ సీనియర్లు ఎవరు కనీసం అభ్యర్థిని పెట్టకుండా మౌనంగా ఉన్నారు.. ఎవరు కోవర్టులు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 40 వేల కాంగ్రెస్ ఓట్లను మూడు వేల ఓట్లకు పరిమితం చేసిన వాళ్లు కోవర్టులా? తానా అని ఆయన నిలదీశారు. గాంధీ కుటుంబంపై బిజెపి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముందు ఖండిచింది తానేనని జగ్గారెడ్డి గుర్తు చేశారు. మరి పార్టీలో పదవులు అనుభవిస్తూ.. స్పందించకుండా మౌనంగా ఉన్నవాళ్లు కోవర్టులా అనేది అధిష్టానం గుర్తించాలని ఆయన హితవు పలికారు.

జగ్గారెడ్డితో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ

ఎంఎల్‌ఎ జగ్గారెడ్డితో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటికి జగ్గారెడ్డిని మాజీ ఎంఎల్‌ఎ సంపత్‌కుమార్ తీసుకొచ్చారు. జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జగ్గారెడ్డి పార్టీని విడవద్దంటూ ఉత్తమ్, గీతారెడ్డి బుజ్జగిస్తున్నారు. సమస్యలుంటే ఢిల్లీలో తేల్చుకుందామని సూచించినట్లు సమాచారం. అధినేత రాహుల్‌గాంధీని కలిసి జరుగుతున్న వ్యవహారాలను,తనకు జరిగిన అవమానాలను వివరించాలని జగ్గారడ్డికి ఉత్తమ్ సూచించారు. పార్టీని వీడతానని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగ్గారెడ్డి నేతలు సూచించారు.

అంతకు ముందు సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎఐసిసి కార్యదర్శి బోస్ రాజులు జగ్గారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ లోపల ఉండి కొట్లాడాలని సూచించారు. పార్టీని వీడొద్దని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు జగ్గారెడ్డిని పార్టీ వీడకుండా నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. జగ్గారెడ్డిని ఇంటికి వెళ్లి ఆయనను కలిసి మాట్లాడారు. జగ్గారెడ్డి ఇంటికి చేరుకున్న పిసిసి జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్.. కాంగ్రెస్‌ని వీడొద్దని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేశారు. జగ్గారెడ్డి కాళ్లపై పడి పార్టీ మారొద్దని కిషన్ బతిమిలాడారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను వేరే పార్టీలోకి వెళ్లనని జగ్టారెడ్డి తెలిపారు. తాను టిఆర్‌ఎస్ కోవర్టునా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనకు పార్టీలో అవమానం జరిగిందని అన్నారు. టిఆర్‌ఎస్‌లోకి పోవాలంటే రెండేళ్ల క్రితమే పోయేవాడినని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నా.. అవమానాల పాలు కావాలా అని ప్రశ్నించారు. పిసిసి పద్ధతి బాగోలేదని విమ ర్శించారు. ప్రస్తుత పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

మరోవైపు.. పార్టీకి సంబంధించిన ఏ విషయాన్ని అయి నా పార్టీలోనే చర్చించుకోవాలని.. బయటికి చెప్పొద్దని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ పార్టీ నేతలకు ఈ సందర్భంగా సూచించారు.
టీ కప్పులో తుఫాన్ : టిపిసిసి చీఫ్ రేవంత్
ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి పార్టీ వీడుతున్నట్లు సోనియాగాంధీకి లేఖ రాయడంపై టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. జగ్గారెడ్డి అంశాన్ని సానుకూలంగా పరిష్కరించుకుని ముందుకు వెళ్తామన్నారు. ఈ సమస్య టీ కప్పులో తుఫా ను లాంటిదన్నారు. కాంగ్రెస్‌లో వ్యక్తుల సమస్యలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. విభేదాలు లేవని.. భిన్నాభిప్రాయాలే ఉన్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News