Saturday, April 27, 2024

మఫ్లర్ మరిచిన రంగేళి కంగాళి కుమార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కూటమి ఫిరాయింపుల నితీశ్‌కుమార్ ఇప్పుడు ఆయా కుమార్ గయా కుమార్ మాదిరిగా మారారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. రాజకీయ ఉసరవెల్లి నితీశ్ ఆయారాం గయారాంల రాజకీయాలలో పరాకాష్ట అవుతున్నారని పార్టీ పేర్కొంది ఆయన నితీశ్ కుమార్ కాదు ఆయా కుమార్ గయా కుమార్ అని చురకలకు దిగింది. ఒక్కరోజు క్రితమే నితీశ్‌కుమార్ బీహార్‌లో కూటమి మారి తిరిగి సిఎంగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ నితీశ్ మఫ్లర్ గురించి తెలిపారు. నితీశ్ ఆదివారం రాజ్యసభలో సిఎంగా ప్రమాణం చేసి ఇంటికి వెళ్లిన తరువాత తన మఫ్లర్ మరిచివచ్చిన విషయం గుర్తించారు. వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లారు. దీనితో గవర్నర్ కంగుతిన్నారు. ఇదేమిటి కేవలం పావుగంట కాకముందే ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి ఏదైనా జరుగుతుందా? అని అనుకున్నారు. తన మఫ్లర్ మరిచాను, తీసుకోవడానికి వచ్చానని నితీశ్ చెప్పారని రమేష్ తమ ట్వీటులో తెలిపారు.

నితీశ్ పరిస్థితి అగమ్యగోచరం అయిందని, చివరికి ఆయన తన పార్టీ తన కూటమి ఏమిటనేది కూడా మరిచిపోతున్నారని, ఆదివారం అయితే కండువా మారే దశలో మఫ్లర్ మర్చినట్లు తెలిపారు. నితీశ్‌ను చూసి ఇప్పుడు చివరికి ఉసరవెల్లిలు కూడా కంగుతింటాయని, అవి కనీసం ఏ రంగులోకి మారాలని ఆలోచించుకుంటాయని, అయితే నితీశ్ ప్రతిరోజూ రంగులు మార్చే యోధుడుగా నిలిచారని , ఈ ఉసరవెల్లులు సిగ్గుపడుతున్నాయని వ్యాఖ్యానించారు. నితీశ్ జేబులో ఎప్పటికప్పుడు కండువాలు, రంగులు సిద్ధంగా ఉంటాయని చమత్కరించారు. సందర్భాన్ని బట్టి ఆయన తన రంగులు మారుస్తారని విమర్శించారు. కుమార్ అంటే ఈ గయా కుమార్ తమను మోసగించాడని, కానీ ప్రజలు ఆయనకు సకాలంలో తగు గుణపాఠం చెప్పితీరుతారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News