Wednesday, May 1, 2024

సిమిపై మరో ఐదేళ్ల నిషేధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉగ్రవాద సంస్థగా స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటన వెలువరించారు. దేశంలో మతసామరస్యం, శాంతి విచ్ఛిన్నతకు ఈ సంస్థ పలు విధాలుగా విద్వేష ప్రచారానికి పాల్పడుతున్నదని పేర్కొంటూ నిషేధం విధించారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణువంత అయినా ఉపేక్షించబోదని, ఇందులో భాగంగానే ఇప్పుడు ఇటువంటి సంస్థపై నిషేధం కొనసాగించినట్లు అమిత్ షా వెల్లడించారు.

2001లో సిమిపై తొలిసారి నిషేధం వేటేశారు. అప్పట్లో దేశంలో అటల్ బిహారీ వాజ్‌పేయి సారధ్యంలో ప్రభుత్వం ఉంది. ఆ తరువాత ప్రతి ఐదు సంవత్సరాలకు సిమిపై నిషేధం కొనసాగుతూ వస్తోంది. సిమిపై నిషేధ సంబంధిత నోటిఫికేషన్‌ను వెలువరించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ సిమి ఇప్పటికీ తన విద్రోహ చర్యలను సాగిస్తోందని , కార్యకలపాలతో ఉనికిని చాటుకునే విధంగా వ్యవహరిస్తోందని , నేతలు అజ్ఞాతంలో ఉంటూ విద్వేషాల వ్యాప్తికి యత్నిస్తున్నారని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News