Sunday, April 28, 2024

ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో‘జల్లికట్టు’కు నిరాశ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లిజోజోస్ పెల్లిసెరీ దర్శకత్వం వహించిన ‘జల్లికట్టు’ మలయాళ సినిమాకు 93వ ఆస్కార్ అవార్డుల షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కలేదు. అంతర్జాతీయ ఫీచ్‌ర్ కేటగరీలో 15 సినిమాల షార్ట్ లిస్ట్‌ను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్సెస్ (అంపాస్) బుధవారం వెల్లడించింది. షార్ట్‌లిస్ట్‌లో థామస్ వింటెన్‌బర్గ్ ‘అనదర్ బర్డ్’, ఆంద్రేయీ కొంచలోవుస్కీ ‘డియర్ కామ్రేడ్’, అగ్నీష్కా హోల్యాండ్ ‘చార్లట్యాన్’(జెక్ రిపబ్లిక్), డాక్యుమెంటరీ చిత్రాలు ‘ది మోల్ ఏజెంట్’(చిలీ), ‘కలెక్టివ్’ (రొమేనియా)తోపాటు మరో 10 చిత్రాలకు షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కింది. వీటిలో ఐదింటిని తుది జాబితాకు ఎంపిక చేస్తారు. తుది జాబితాను మార్చి 15న ప్రకటిస్తారు. 2019లో 50వ భారత అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన జల్లికట్టుకు పెల్లిసెరీ బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు. ఆస్కార్ అవార్డుకు జల్లికట్టుపై ఆశలు పెట్టుకున్నవారికి ఇది నిరాశ కలిగించే వార్తే. ఇప్పటి వరకు ఏ ఒక్క భారతీయ చిత్రం కూడా ఆస్కార్‌కు ఎంపిక కాకపోవడం గమనార్హం. తుది ఐదు జాబితాలో చివరిగా లగాన్‌కు 2001లో చోటు దక్కింది. 1958లో మదర్ ఇండియా, 1989లో సలామ్‌బాంబేకు కూడా తుది ఐదులో చోటు దక్కినా ఆస్కార్ గెలుచుకోలేకపోయాయి.

Jallikattu movie not selected for Oscar Shortlist 2021

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News