Sunday, April 28, 2024

జానా శాశ్వతంగా ఇంట్లోనే ఉంటారు: తలసాని

- Advertisement -
- Advertisement -

Jana reddy defeat in nagarjuna sagar by elections

 

నల్లగొండ: వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో టిఆర్‌ఎస్ ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో భాగంగా తలసాని మాట్లాడారు. చివర వరకు ప్రజల కోసమే పని చేసిన వ్యక్తి నోముల నర్సింహయ్య అని అన్నారు. భగత్‌ను గెలిపిస్తే హాలియాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తరువాత మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జానారెడ్డి శాశ్వతంగా ఇంట్లోనే ఉంటారని ఎద్దేవా చేశారు. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గత ఎన్నికలలో జానా ఓడిపోయిన తరువాత ప్రజల మధ్యకు రాలేదన్నారు. పుట్టిన ఊరు అనుమూలుకు జానా ఎప్పుడు రాలేదని, ఓట్లు ఎలా వేస్తారని ప్రజలను తలసాని ప్రశ్నించారు. యువకుడికి అని విధాలు తాము సహాయం చేస్తామని, నియోజక వర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. నాగార్జున సాగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. బిసి వర్గాల, వెనకబడిన వర్గాల బిడ్డను అందరూ దీవించాలని కోరారు. తండ్రిని కోల్పోయిన బిడ్డ కాబట్టి దీవించాలన్నారు. నోముల భగత్‌కు మద్దతుగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News