Sunday, April 28, 2024

జపాన్‌లో ఆర్థిక మాంద్యం

- Advertisement -
- Advertisement -

మానవ వనరుల లేమి కారణం

టోక్యో : ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ దేశం జపాన్‌లో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అమెరికా, చైనా, జర్మనీ తరువాత జపాన్ ఆర్థికంగా బాగా ఉంటూ వచ్చింది. ఈ దేశంలో రెసెషన్ పరిస్థితి తలెత్తడం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంలో సంచలనానికి దారితీసింది. 2023లో జపాన్ జర్మనీ తరువాతి స్థానంలోకి చేరింది. ఆ తరువాత కూడా ఆర్థిక మాంద్యం కొనసాగుతూ వచ్చింది.

గడిచిన ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి వార్షిక ఆర్థిక వృద్ధిరేటు 0.4 శాతం క్షీణించిందని జపాన్ ప్రభుత్వం గురువారం తెలిపింది, వాస్తవిక జడిపి గణాంకాలను గురువారం వెలువరించారుగడిచిన ఏడాది మొదటి భాగం బాగానే ఉన్నప్పటికీ తరువాతి దశలో పరిస్థితి క్షీణించిందని వెల్లడించారు. డాలర్‌తో పోలిస్తే బలహీనమైన కరెన్సీగా యెన్ నిలిచింది. జనాభా తక్కువ కావడం, మానవ వనరుల లేమితో ఉత్పాదన లక్షాలు , పోటీ సామర్థంలో వెనుకంజ వంటివి కీలక పరిణామాలని, ఇదే ఇప్పటి తిరోగమనానికి దారితీసిందని ఆర్థికవేత్తలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News