టాలీవుడ్‌లో మంచి సక్సెస్ కావాలంటే.. మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సరిపోదు.. టాలెంట్‌తో పాటు కొంత లక్ కూడా ఉండాలి. అలా స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి తన టాలెంట్‌తో ఫ్యాన్స్‌ని సంపాదించుకను్న నటుడు సుధీర్ బాబు. చేసే ప్రతీ సినిమాకు వేరియేషన్ చూపిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాడు. అతను తాజాగా నటిస్తున్న చిత్రం ‘జటాధర’ (Jatadhara). జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా విలన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు.
టీజర్‌లో (Jatadhara) విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ‘‘త్యాగం కోసం జన్మించిన వ్యక్తి అతడు. దురాశ సృష్టించిన ఓ చీకటి ఆమె’’ అంటూ హీరో, విలన్ పాత్రలను టీజర్‌లో వర్ణించారు. దురాశ, త్యాగానికి మధ్య జరిగే యుద్ధం ఇది అంటూ టీజర్‌లో వెల్లడించారు. ఇక ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించగా.. ఉమేశ్ కుమార్ బన్సల్, శివిన్ నరాంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగల్, నిఖిల్ నంద నిర్మాతలుగా వ్యవహరించారు. త్వరలోనే ఈ సినిమా తెలుగు-హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.