Sunday, April 28, 2024

‘జయమ్మ పంచాయతీ’ మోషన్ పోస్టర్ అదిరింది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పలు టీవి షోలతో ప్రేక్షకులను అలరించి బుల్లితెర స్టార్ గా ఎదిగిన సుమ కనకాల వెండితెరపై మెరిసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సుమ ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. కొద్దిసేపటి క్రితం మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ మూవీ ఫస్టు లుక్ మోషన్ పోస్టర్ అదిరింది. ఇందులో సుమ, బాహుబలిలో శివగామి లెవల్ లో ఇచ్చిన లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ ను చూస్తుంటే ఫుల్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను మూవీ మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

https://youtu.be/i3GdC37zQPg

Jayamma Panchayathi motion poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News