Saturday, May 18, 2024

జెఇఇ అడ్వాన్డ్స్‌లో చిరాగ్ ఫలోర్ టాపర్

- Advertisement -
- Advertisement -

జెఇఇ అడ్వాన్డ్స్‌లో చిరాగ్ ఫలోర్ టాపర్
బాలికలలో కనిష్కా మిట్టల్‌కు మొదటి ర్యాంకు

JEE Advanced 2020 Relusts Released

న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జెఇఇ) అడ్వాన్డ్స్ పరీక్షా ఫలితాలలో పుణెకు చెందిన చిరాగ్ ఫలోర్ మొదటి ర్యాంకు సాధించాడు. ఐఐటి-ఢిల్లీ నిర్వహించిన జెఇఇ-అడ్వాన్డ్ పరీక్షల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. రెండవ ర్యాంకును గంగుల భువన్ రెడ్డి, మూడవ ర్యాంకును వైభవ్ రాజ్ సాధించారు. బాలికలలో కనిష్కా మిట్టల్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా ఐఐటిలలో అడ్మిషన్ల కోసం జెఇఇ-అడ్వాన్డ్ పరీక్షలు జరిగాయి. కాగా, దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం జెఇఇ-మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జెఇఇ-అడ్వాన్డ్ పరీక్షకు ఇదే అర్హత పరీక్ష కూడా.
ఇలా ఉండగా..అమెరికాలోని మస్సాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్)లో తన చదువును కొనసాగిస్తానని జెఇఇ అడ్వాన్డ్స్ పరీక్షలో ప్రథమ ర్యాంకు సాధించిన పుణెకు చెందిన చిరాగ్ ఫాలోర్ తెలిపాడు. జెఎఇఇ-మెయిన్స్‌లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించిన చిరాగ్ మార్చిలో మిట్‌లో అడ్మిషన్ సంపాదించాడు. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా అతను ఆన్‌లైన్‌లో తన చదువును ఇక్కడి నుంచే కొనసాగిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో ఇప్పటికే క్లాసులకు హాజరయ్యానని, అక్కడే తన చదువును కొనసాగిస్తానని అతను తెలిపాడు.
జెఇఇ-అడ్వాన్డ్స్ పరీక్షకు మొత్తం 1.6 లక్షల మంది విద్యార్ధులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా 1.5 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 6,707 మంది బాలికలతో సహా 43,000 మంది ఉత్తీర్ణులయ్యారు. చిరాగ్‌కు మొత్తం 396 మార్కులలో 352 మార్కులు లభించాయి.

JEE Advanced 2020 Relusts Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News