Friday, May 10, 2024

పుస్తకాలతో కుస్తీ

- Advertisement -
- Advertisement -

హైదరబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ శాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా, మరిన్ని నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన పోస్టులకు త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చేలా టిఎస్‌పిఎస్‌సి చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసి విజయవంతంగా ప్రిలిమిన రీ పరీక్ష నిర్వహించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతుండంతో నిరుద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ప ట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాలలో అభ్యర్థులు పె ద్ద సంఖ్యలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

దాంతో రాష్ట్రంలో యూనివర్సిటీలలో గ్రంథాలయాలు, జిల్లా, శాఖ గ్రంథాలయాలు అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయాలు ఉదయం 8నుంచి రాత్రి 9 గంటలు, శాఖా గ్రంథాలయాలు ఉదయం 8 నుంచి 11, మధ్యాహ్నం 3 నుంచి -7 గంటల వరకు పనిచేస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణను నిర్వహిస్తున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎక్కువ మందికి ఈ శిక్షణను అందిస్తుండగా, గ్రూప్స్ పరీక్షలకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి స్టడీ సర్కిల్ ద్వారా కూడా ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.అలాగే నియోజకవర్గాలలో ఎంఎల్‌ఎలు, ఎంపిలు ఇప్పిస్తున్నారు. అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న ఉచిత కోచింగ్‌లను ఉపయోగించుకుంటూనే సొంతం గా శ్రమిస్తున్నారు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు నోటిఫికేషన్‌లు ఇవ్వడంతో నిరుద్యోగులు పోటాపోటీగా శిక్షణ తీసుకుంటున్నారు. కొవిడ్‌కు ముందు ఎక్కువగా ఆఫ్‌లైన్‌లోనే శిక్షణ కొనసాగగా, కొవిడ్ తర్వాత మాత్రం ఆన్‌లైన్ శిక్షణకు డిమాండ్ పెరిగింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు సొంతంగా ఆప్ ద్వారా శిక్షణ అందిస్తున్నా యి. అయితే ఆన్‌లైన్‌లో పూర్తి స్థాయి శిక్షణ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ఆఫ్‌లైన్ శిక్షణపై ఆసక్తి చూపడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో అ యితే ఎక్కటి నుంచైనా క్లాసులు వినడంతోపా టు ఆన్‌లైన్‌లో పరీక్ష రాసే విధానం అందుబాటులో ఉం టుంది. అలాగే ఉద్యోగాలు చేసుకునేవారు కూడా ఆన్‌లైన్ కోచింగ్‌కే మొగ్గుచూపుతున్నారని పేర్కొంటున్నారు. అదే ఆఫ్‌లైన్‌లో అయితే కచ్చితంగా హైదరాబాద్‌కు వచ్చి హాస్టళ్లలో ఉంటూ శిక్షణ తీ సుకోవలసి ఉంటుంది. ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండదు.

దాంతో ఎక్కువ శాతం అభ్యర్థులు ఆన్‌లైన్ కోచింగ్‌కే మొగ్గు చూపుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు గ్రూప్ 1 తుది కీ విడుదలైనప్పటికీ మహిళా రిజర్వేషన్లపై మహిళా రిజర్వేషన్లపై న్యాయస్థానంలో కేసు ఉన్నందున మెయిన్స్ ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. అలాగే పో లీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా, ప్రస్తుతం ఈవెంట్లు కొనసాగున్నాయి. మరో రెండు వారాలలో గ్రూప్ 2,3 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. గ్రూప్ 4, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, హార్టికల్చర్ కల్చర్ ఆఫీసర్, వెటర్నరీ ఆఫీసర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్లు వెలువడగా, త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. 726 ఉద్యోగాలతో గ్రూప్ 2, 1,373 ఉద్యోగాలతో గ్రూప్ -3 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
పోటీ పరీక్షలకు అకాడమీ పుస్తకాలు
వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక పుస్తకాలను మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. పోటీ పరీక్షల కోసం ఇన్నాళ్లు కోచింగ్‌లకు వెళ్లి నా.. మార్పు చేసిన పరీక్షల విధానం, సిలబస్ కారణంగా అకాడమీ రూపొందిస్తోంది. రా ష్ట్రంలో పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ 42 రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పో టీ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా జాతీయ స్థాయి అంశాలకు సంబంధించిన పుస్తకాలను రాయించి ముద్రించింది. ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 వంటి పోటీ పరీక్షలే ప్రధాన లక్ష్యంగా, వాటి సిలబస్ ఆధారంగా అకాడమీ పుస్తకాలను తీసుకువస్తుంది. గ్రూప్స్, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ సహా పలు నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని స్పల్పమార్పులు చేసిన పుస్తకాలను ముద్రించింది. ఈ పుస్తకాలను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆవిష్కరించారు.

వీటితోపాటు ప్రముఖ రచయితలు రచించిన పుస్తకాలను అభ్యర్థులు చదువుతున్నారు. ప్రధానంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలతో సహా ప్రముఖుల పుస్తకాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణ పరిచయం, పూర్వ తెలంగాణ చరిత్ర, ప్రాచీన తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య చరిత్ర, శాతవాహనుల పాలన, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, కాకతీయుల కాలం, పద్మనాయకులు, నాయంకర్ల వ్యవస్థ, ముసునూరి నాయకులు, బహమని సుల్తాన్‌లు, కుతుబ్‌షాహీలు, నిజాంల పాలన, హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పూర్వ తెలంగాణ ఉద్యమం, మలి దశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఉద్యమాల్లో ప్రజాసంఘాలు, కవులు, కళాకారుల పాత్ర తదితర అంశాలను వివిధ పుస్తకాలలో చదువుతూ సొంతంగా నోట్స్ రూపొందించుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News