Tuesday, May 7, 2024

5 మిలియన్ల ఫాలోవర్స్

- Advertisement -
- Advertisement -

మాస్ ప్రేక్షకులలో భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. అందుకు నిదర్శనంగా తన సినిమాల ఓపెనింగ్ వసూళ్లే నిలుస్తాయి. ఇక సోషల్ మీడియాలో కూడా తారక్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా తారక్ తన ట్విట్టర్ ఖాతాలో 5 మిలియన్ మార్క్‌ను చేరుకున్నాడు. 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది టాలీవుడ్ స్టార్ నటుల్లో ఒకరిగా తారక్ నిలిచాడు. ఇదిలా ఉండగా తారక్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆతర్వాత కొరటాల శివతో ఓ సినిమా, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Jr NTR gets 5 Million followers on Twitter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News