Sunday, April 28, 2024

పులివెందులలో నడి రోడ్డుపై కాల్పులు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా పులివెందులలో పట్టపగలు నడిరోడ్డుపై కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చింత కుంట గ్రామానికి చెందిన దీలీప్ కుమార్ (30), ఆయన బంధువు మహబూబా భాషా (35) ఉన్నారు. దీలిప్ కుమార్-భరత్ యాదవ్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం భరత్ కుమార్ తనకు డబ్బులు ఇవ్వాలని దిలీప్ కుమార్‌ను అడిగాడు.

కానీ దిలీప్ తో పాటు భాషా కూడా ఉండడంతో ముగ్గురు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో భరత్ తుపాకీ తీసి దిలీప్ కుమార్, భాషాపై కాల్పులు జరిపారు. వెంటనే భరత్ యాదవ్ కింద బుల్లెట్ షేల్స్‌ను తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయడపడిన దిలీప్, భాషాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దిలీప్ దుర్మరణం చెందాడు. భాష పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు. రెండు సంవత్సరాల కిత్రం భరత్ వద్ద దిలీప్ 50 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. నెల నెల వడ్డీ చెల్లిస్తున్నప్పటికి అసలు చెల్లింపు విషయంలో గొడవ జరిగినట్టు సమాచారం.

గతంలో భారత్ యాదవ్ తన ఇంటి ప్రహారి గోడ విషయంలో పక్కింటి వ్యక్తిని తుపాకీతో బెదిరించాడు. తుపాకీతో బెదిరిస్తూ, ల్యాండ్ సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడు. మాజీ మంత్రి వివేకా నందా రెడ్డి హత్య కేసులో భరత్‌ను ప్రశ్నించారు. ఈ హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్‌కు భరత్ దగ్గరి బంధువు కావడంతో హత్య జరిగిన రోజున సునీల్‌కు అతడు మద్య సరఫరా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News