Sunday, May 12, 2024

శ్రీరామతో కాళేశ్వరుడి కరచాలనం

- Advertisement -
- Advertisement -

ముప్కాల్ : కాళేశ్వరం జలాలు గోదారమ్మ ఒడిలోకి చేరిన అద్బుతమైన ఘట్టం ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన ఎస్‌ఆర్‌ఎస్‌పి జీరో పాయింట్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వేల మంది కరతాల ధ్వనుల మధ్య జై కెసిఆర్ జైజై తెలంగాణ అనే నినాదాల మధ్యన కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారతుల వీక్షిస్తుండగా ఒక్కసారి ప్రాజెక్టు లోని మూడు పైపుల ద్వారా నీటి విడుదల చేయడం జరిగింది. పరుగు పరుగులు పెడుతూ కాళేశ్వరం జలాలు గోదారమ్మను ముద్దాడాయి. అంతకుముందు ఎంపి, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి కాళేశ్వరం జలాలును స్విచ్ ప్రారంభించి నీటిని విడుదల చేయడం జరిగింది. అనంతరం కాళేశ్వరం నీళ్లు ఎలా వస్తున్నాయో ఏర్పాటు చేసిన నమూనా చిత్రాన్ని మంత్రులందరూ కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిధి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దయగల ముఖ్యమంత్రి కెసిఆర్ అని, రైతు గోస తెలిసిన రైతు బాంధవుడు అని కొనియాడారు.

వర్షాలు పడక, పంటలు పండగ, రైతులు ఇబ్బంది పడుతున్న వేళ రైతులకు ఏది చేస్తే న్యాయం జరుగుతుందో తెలిసిన మహా మేధావి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నాడు. వచ్చేది మల్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని, మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని గంట పదంగా బల్ల గుద్ది చెప్తున్నానన్నాడు. బిఆర్‌ఎస్ కాక మరో రెండు పార్టీలు ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకునే పార్టీలని వాటిని గెలుపేయడం కాదు ఓటు కూడా వేయొద్దని హెచ్చరించారు. తమ నాయకుడు ఒక్కడే కెసిఆర్ అని తమంత ఆ ఒక్కడి కింద పని చేసే పని వాళ్ళమని తమ నాయకుడు దమ్మున్న నాయకుడిని మెచ్చుకున్నాడు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్వహణలో తమ కొడుకు సమానుడు, మన జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అహర్నిశలు ఎంతో కష్టపడ్డారని, అతను నిజంగా అదృష్టవంతులని కొనియాడారు. అంతకుముందు మన జిల్లా మంత్రి, రోడ్డు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాలేశ్వరం నీళ్లు గోదారిలో కలవడం చాలా సంతోషకరమైన విషయమని, రైతుల కళ్లలో ఆనందదాయకమైన రోజిదని, మనందరం కెసిఆర్‌కు రుణపడి ఉండాలని అన్నాడు.

గతంలో జలసాధన కార్యక్రమంలో ఐదు లక్షల మందిలో తాను ఒక కార్యకర్తలని కెసిఆర్ ఆరోజు అన్న మాట ఇప్పటికి గుర్తుందని ఒక్కసారి తెలంగాణ ఇచ్చి చూడండి గోదారమ్మకు నా కాలు అడ్డం పెట్టి నీళ్ళు అపుతాను అన్న దూర దృష్టి గల నాయకుడు కెసిఆర్ అని అన్నాడు. తన జన్మ ధన్యమైందని ఇంత గొప్ప ప్రాజెక్టులో తాను ఒక భాగస్వామిని కావడం, తనవంతు కృషిని చేసే అదృష్టాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ కల్పించడం ఒక గొప్ప వరమన్నాడు. ఎంత మంది నాయకులు ఉన్న ఎంత మంది ప్రతిపక్ష హోదాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న రైతులకు నీళ్లు ఎలా తెస్తారు అని ప్రశ్నలు వేసిన 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాలేశ్వరం నీళ్లను 103 కిలో మీటర్ల వరద కాలువ ద్వారా తీసుకు వచ్చే ఒక్క మగాడు కెసిఆర్ అని కొనియాడారు. ప్రాజెక్టులో నీళ్లు దిగువన ఉంటే 300 కిలో మీటర్లు ఎగువకు తీసుకొస్తానని చెప్పిన దీరోధాతుడు కెసిఆర్ అన్నాడు. అనంతరం మాట్లాడిన ఎంపి సురేష్‌రెడ్డి ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఈ గొప్ప పనిని పది మందికి చెప్పాలని కెసిఆర్‌కే మనం తిరిగి ఓటేసి గెలిపించాలని అన్నాడు.

అనంతరం మాట్లాడిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ దిక్కు లేక ఎంపి అరవింద్ ఫోటో పెట్టుకోవాల్సి వచ్చిందని, ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుందని, అలాంటి వాడిని ఎలక్షన్లు గెలిపించి తప్పు చేశారని తిరిగి ఎలక్షన్ లో బుద్ది చెప్పాలని అన్నారు. తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లెక్సీలో ఫోటో ఎంపి ది ఎందుకు పెట్టారని వాడు రైతులను మోసం చేసే దొంగ అని, పసుపు బోర్డు తెస్తా అని మాయమాటలు చెప్పి మోసం చేశాడని అన్నాడు. కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, రేఖా నాయక్, విజి గౌడ్, విట్టల్ రెడ్డి, ఆకుల లలిత, భాస్కర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, ప్రాజెక్టు అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News