Saturday, May 18, 2024

సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వేముల

- Advertisement -
- Advertisement -

ముప్కాల్ : కాలేశ్వరం నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పి జీరో పాయింట్ ముప్కాల్ వద్ద గోదావరి నదిలో చేరే అద్భుతమైన ఘట్టానికి ఏర్పాటు చేసిన సభా స్థలాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం సాయంత్రం పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నీళ్ల విడుదల కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాటును పూర్తి చేస్తున్నారు. దాదాపు 3000 మంది జనాభాతో సభ నిర్వహిస్తుండడంతో అన్ని ఏర్పాట్లను మంత్రి పకడ్బందీగా పరిశీలించారు. రివర్స్ పంపింగ్ జీరో పాయింట్ వద్ద గేట్లను పరిశీలించి అవి సరిగా ఉన్నాయో లేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని గ్రామాల ప్రజలకు ముందుగానే సభ నిర్వహిస్తున్నామని తెలుపడంతో భారీ ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉన్నందున పోలీస్ బందోబస్తు కూడా గట్టి ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో నిర్వహించే కాలేశ్వరం నీళ్లు రివర్స్ పంపిన ద్వారా జీరో పాయింట్ వద్ద గోదావరికి విడుదల చేసే మహాసభకు మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దాదాపు ఐదు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు వస్తారని బిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. రాత్రి సమయంలో విద్యుత్‌కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా నిలిపిస్తాయని తిరిగి రేపు ఉదయం ప్రారంభిస్తామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News