Sunday, May 5, 2024

మట్టి పాత్రలతకు కేరాఫ్‌గా మారబోతున్న సిద్దిపేట

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: మట్టి పాత్రలతకు కూడా కేరాఫ్‌గా సిద్దిపేట మారబోతుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కుమ్మర్ల పైలెట్ ప్రాజెక్ట్ కింద 2.20 కోట్ల నిధుల జీవో కాఫీని కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు దరిపల్లి శ్రీను, పైలెట్ ప్రాజెక్ట్ ఇంచార్జినెల్లుట్ల విజయ్‌లకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరుగున పడుతున్న కు మ్మర వృతిని బతికించడానికి ,ప్లాస్టిక్ మ హమ్మారిని అంతమొందించడానికి ప్రజలను ఆనారోగ్యం నుంచి బయట ప డటానికి అన్నింటికి ప్రత్నామ్నాయం మట్టి పాత్రులను వాడడం అని భావించి మట్టి పాత్రలను వాడడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

కాలుష్యం కూడా లేకుండా ఉంటుందని ఆలోచన చేసి రాష్ట్రంలోనే మొట్ట మొదటగా సిద్దిపేటలోనే మట్టి పాత్రల తయారి కేంద్రాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ పైలెట్ ప్రాజెక్టులో ఇంట్లో వాడుకునే అన్ని పాత్రలు, ఆలంకరణకు పెట్టుకునే చిన్న చిన్న బోమ్మలు వంటివి అన్ని మట్టిని ఉపయోగించి ఆదునికరమైన మిషన్లతో యాదరు చేస్తారు.

ఈ ప్యాక్టరి వల్ల సిద్దిపేట నియోజక వర్గానికి చెందిన అన్ని కుమ్మర కుటుంబాలకు లాభం జరుగుతుంది. సిద్దిపేట నుండే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మట్టి పాత్రలు అందజేసి మట్టి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా సిద్దిపేట కుమర్మల పైలెట్ ప్రాజెక్ట్ అని చాటి చెప్పేలా ఉండాలన్నారు.

సిద్దిపేట నియోజక వర్గ కుమ్మర్లకు గతంలోరెండు ఎకరాల స్థలాన్ని కేసీఆర్ నగర్‌లో కేటాయించడం జరిగిందన్నారు. కుమ్మర్ల పైలెట్ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి సీఎం కేసీఆర్ రెండు కోట్ల 20 లక్షల రూపాయలను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మర్ల సంఘం నాయకు లు వర్కోల్ శ్రీనివాస్, గోవిందారం శ్రీనివాస్, భూమయ్య, తిరుపతి, రవీందర్, రామచంద్రం, ఆంజనేయులు, సంపత్, కృష్ణమూర్తి, రాజు, రామ్మెహన్, బాలు, రాజు, రఘు, నగేశ్, కిషన్, శ్రీను, భగవాన్, రాములు, కిష్టయ్య, మధు, కిషన్, శ్రీను, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News