Sunday, April 28, 2024

కళ్యాణి వచ్చా వచ్చా…

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‘ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ’కళ్యాణి వచ్చా వచ్చా..’ విడుదలైంది. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వచ్చే ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించగా…మంగ్లి, కార్తీక్ ఎనర్జిటిక్‌గా పాడారు. గోపీ సుందర్ మంచి డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో విజయ్, మృణాల్ మేకోవర్, అప్పీయరెన్స్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

‘ఫ్యామిలీ స్టార్‘ సినిమాలో ఈ పాట కలర్‌ఫుల్‌గా ఉండబోతోంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ‘ఫ్యామిలీ స్టార్‘ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News