Sunday, April 28, 2024

తమిళనాడులో 154 స్థానాలకు కమల్ పార్టీ పోటీ

- Advertisement -
- Advertisement -

Kamal Haasan's party is contesting for 154 seats in Tamil Nadu

 

మిత్రపక్షాలతో కుదిరిన సీట్ల సర్దుబాటు

చెన్నై: ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విలక్షణ నటుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం)తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుకు సంబంధించి మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 154 స్థానాలనుంచి ఆ పార్టీ పోటీ చేస్తుంది. మిగతా 80 స్థానాల్లో మరో సినీ నటుడు శరత్‌కుమార్‌కు చెందిన అలిండియా సమతువ మక్కల్ కచ్చి40 స్థానాల్లో, ఇండియా జననాయక కచ్చి( ఐజెకె) మిగతా 40 స్థానాల్లో పోటీ చేస్తాయి. ఈ మూడు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సోమవారం రాత్రి అంగీకారం కుదిరింది. తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తామన్న హామీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయం సాధించడమే ఈ కూటమి ప్రధాన లక్షమని ఆ ఒప్పందం పేర్కొంది.

రాష్ట్రప్రజల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆకాంక్షలను నెరవేర్చడంద్వారా తమిళనాడులో మార్పు తీసుకు రావడానికి తమ పార్టీలు కట్టుబడి ఉన్నాయని కూడా ఆ ఒప్పందం పేర్కొంది. 2018లో మక్కల్‌నీది మయ్యం పార్టీని ప్రారంభించిన కమలహాసన్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయగా ఆ పార్టీకి 3.77 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.2019 లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకె గుర్తుపై పెరంబూర్ లోక్‌సభ స్థానంనుంచి ఎన్నికైన టిఆర్ పారివెందర్ (పచ్చముత్తు) ఐజెకె పార్టీని ఏర్పాటు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ బిజెపి నేతృత్వంలోని కూటమి భాగస్వామిగా ఉండింది. కాగా200106 మధ్య కాలంలో డిఎంకె రాజ్యసభ సభ్యుడిగా ఉండిన శరత్‌కుమార్ ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి అన్నాడిఎంకెలో చేరారు. తర్వాత తానే సొంతంగా పార్టీ ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News