Monday, September 22, 2025

ప్రియురాలిని చంపేసి… మృతదేహంతో సెల్ఫీ దిగిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓ యువకుడు, యువతితో సహజీవనం చేస్తుండగా ఆమె మరో యువకుడితో మాట్లాడుతుందని గొంతు నలిమి చంపి మృతదేహంతో సెల్ఫీ దిగాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్ రాష్ట్రం తానా హనుమాన్ చెందిన ఆకాంక్ష(20) అనే యువతి యుపిలోని కాన్పూర్‌లో ఓ కనా ఫుడ్ రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. ఫతేపూర్ ప్రాంతం బిందిగికి చెందిన సురజ్ కుమార్ ఉత్తమ్ అనే యువకుడుతో ఆకాంక్ష సహజీవనం చేస్తోంది. ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నారు. జులై 21 నుంచి ఆకాంక్ష కనిపించకపోవడంతో ఆమె తండ్రి విజయ్ శ్రీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె మొబైల్ కాల్ రికార్డును బయటకు తీశారు.

Also Read: అమర వీరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి: కోదండరాం

సూరజ్‌తో పలుమార్లు మాట్లాడినట్టు తేలడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. ఆకాంక్ష, సూరజ్ ఒకే రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఆకాంక్ష మరో యువకుడితో మాట్లాడుతుండడంతో ఆమెను పలుమార్లు అతడు హెచ్చరించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆమెను గొడకు నెట్టేయడంతో కిందపడింది. వెంటనే గొంతు నులిమి చంపేసి తన స్నేహితుడు అశిష్ కుమార్‌కు ఫోన్ చేసి రమ్మని కబురు పంపాడు. మృతదేహాన్ని గన్నీ బ్యాగ్‌లో మూటకట్టిలో ఆటోలో తీసుకెళ్లారు. జన్‌పద్‌లోని చిలాద్‌పూర్ తీసుకెళ్లి యమునా నది పక్కన పడేశారు. ఆటోలో తీసుకెళ్తున్నప్పడు సూరజ్ మృతదేహంతో సెల్ఫీ దిగాడు. పోలీసులు సూరజ్ తో ఆశిష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News