Saturday, May 4, 2024

సైన్‌బోర్డుల్లో 60 శాతం కన్నడపై ఆర్డినెన్స్ తెస్తాం:సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార సంస్థల సైన్ బోర్డులు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం చోటు కన్నడలో ఉండాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గురువారం చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఈ మేరకు మార్పులు చేయాలని ఆయన షాపుల యజమానులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులు అమలయ్యేలా చూడడం కోసం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకు వస్తామని కూడా ఆయన చెప్పారు. సైన్‌బోర్డులు, నేమ్‌ప్లేట్లు, అడ్వర్టయిజ్‌మెంట్లు కన్నడ భాషలోనే ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ కన్నడ ఆనుకూల సంస్థలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ స్పష్టత ఇచ్చారు. నేమ్‌బోర్డులపై 60 శాతం కన్నడ ఉండాలన్న నిబంధనను పాటించని వ్యాపార సంస్థల లైసెన్లును రద్దు చేయడం జరుగుతుందని బృహత్ బెంగళూరు మహానగర పాలికె( బిబిఎంపి)గత వారం జారీ చేసిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి ప్రకటన మరోసారి సమర్థించినట్లయింది.

బెంగళూరు కార్పొరేషన్ ఈ ఉత్తర్వులు జారీ చేశాక నగరంలో ఈ నిబంధనలు పాటించని వ్యాపారసంస్థలకు వ్యతిరేకంగా కన్నడ అనుకూల ఆందోళనకారులు ఆందోళనలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరగడంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ..శాంతియుత నిరసనలకు తమ ప్రభుత్వంవ్యతిరేకం కాదని, అయితే ప్రజలు చట్టానికి వ్యతిరేకంగా నడుచుకొనే సంఘటనలను సహించదని స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. బిబిఎంపి అధికారులు, సాంస్కతిక వ్యవహారాల విభాగం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News