Tuesday, May 7, 2024

కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ప్రారంభమైంది : ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం ప్రారంభమైందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలకు నెలకి 2 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన మాట వెంటనే అమలు చేస్తున్నాయన్నారు. కర్నాటకలో హామినిచ్చిన 5 గ్యారంటీ పథకాలు 200 విద్యుత్ యూనిట్లు నిరుపేద్దలకు ఇస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని, .గృహలక్ష్మి పథకం అమలులోకి వచ్చిందని, అన్న భాగ్య పథకం కింద నెలకి 5 కిలోల బియ్యం లేదంటే 170 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. రెండు నెలలు తిరగక ముందే 5 గ్యారంటీ పథకాల్లో నాలుగు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వచ్చే నెల నుండి యువనిధి స్కీమ్ అమలు చేస్తా మన్నారు.

హిమాచల్ ప్రదేశ్ లో గెలిచిన వెంటనే పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసినట్లు తెలిపారు. తెలంగాణ లో కూడా ఉద్యోగుల డిమాండ్ మేరకు పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు.తెలంగాణ లో ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కిలో బియ్యం బిఆరెస్ ప్రభుత్వం ఇస్తుంటే మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్, కేజీ టూ పీజీ అమలు కావడం లేదని విమర్శించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. దళిత గిరిజనలకు 3 ఎకరాలు, ఉచిత ఎరువులు అమలు చేయలేదన్నారు. రాహుల్ గాంధీ నెత్రుత్వంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. తాము అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉందని, ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ కి కలసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉప్పెనలో బిఆరెస్ కొట్టుకుపోతుందన్నారు.

తను హుజూర్ నగర్ నుండి, కోదాడ నుండి పద్మావతి రెడ్డి పోటీ చేస్తామన్నారు. టికెట్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలనీ అధిష్టానన్ని కోరుతున్నామని చెప్పారు. ఎఐసిసి నిబంధనల మేరకు ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకే టికెట్లు ఉంటాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News