Tuesday, May 7, 2024

కర్నాటక కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ధర్మె గౌడ ఆత్మహత్య?

- Advertisement -
- Advertisement -
Karnataka Legislative Council deputy chairman found dead
ఆత్మహత్యగా అనుమానం

బెంగళూరు: కర్నాటక శాసనమండలి డిప్యుటీ చైర్మన్ ఎల్‌ఎల్ ధర్మె గౌడ మృతదేహం రైలు పట్టాలపై కనిపించడం సంచలనం సృష్టిస్తోంది. చిక్కమగళూరు జిల్లాలోని కడూర్ తాలూకా గుణసాగర సమీపంలో రైలు పట్టాలపై గౌడ మృతదేహం మంగళవారం తెల్లవారుజామున లభించింది. 64 సంత్సరాల ధర్మె గౌడ జెడిఎస్ నుంచి ఎంఎల్‌సిగా గెలుపొందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన సోదరుడు ఎల్‌ఎల్ భోజె గౌడ కూడా ఎంఎల్‌సిగా ఉన్నారు. శఖరాయపట్టణలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి సోమవారం సాయంత్రం ఒక ప్రైవేట్ కారులో బయల్దేరిన ధర్మె గౌడ రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఎవరితోనో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి తన కారు డ్రైవర్‌ను కొంత దూరంలో నిలబెట్టి ఆయన నడుచుకుంటూ వెళ్లారని వర్గాలు తెలిపాయి. సంఘటన స్థలంలో ఒక సూసైట్ నోట్ లభించినట్లు వారు చెప్పారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గౌడ మృతదేహాన్ని శివమొగ్గలోని మెక్‌గన్ ఆసుపత్రికి తరలించారు. కాగా..గౌడ మృత సంఘటన పట్ల ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

డిప్యుటీ చైర్మన్‌గా ఆయన శాసనమండలిని సమర్థంగా నిర్వహించారని ముఖ్యమంత్రి కీర్తించారు. జెడిఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కూడా ధర్మె గౌడ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి రాష్ట్రానికి తీరనిలోటని ఆయన పేర్కొన్నారు. ధర్మె గౌడ తనకు సోదరుని లాంటి వారని మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామి పేర్కొన్నారు.  ఇదిలా ఉండగా&డిసెంబర్ 15న కర్నాటక శాసనమండలి సమావేశంలో రభస జరిగిన సమయంలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న ధర్మె గౌడపై ప్రతిపక్ష సభ్యులు విరుచుకుపడి ఆయనను బయటకు లాక్కు వెళ్లారు. మండలి చైర్మన్ కె ప్రతాప్‌చంద్రా రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి బిజెపి-జెడిఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరగడంతోపాటు సభ్యులు ఒకరినొకరు తోసుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా సభాధ్యక్ష స్థానంలో కూర్చున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు కొందరు గౌడను చైర్మన్ సీటులోనుంచి బయటకు ఈడ్చివేశారు.

Karnataka Legislative Council deputy chairman found dead

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News