Sunday, April 28, 2024

దీపావళి కానుకగా ’జపాన్’…

- Advertisement -
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ’జపాన్’ చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌ని దీపావళికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

రిలీజ్ పోస్టర్ లో కార్తి ఒక చేతిలో గన్ మరో చేతిలో గ్లోబ్ తో స్టన్నింగ్ లుక్ లో కనిపించారు. మేకర్స్ త్వరలోనే టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News