Thursday, October 10, 2024

హైదరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సీపీ ఆఫీస్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.సీపీ ఆఫీస్ కు వెళ్​లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూసైబరాబాద్ సీపీ ఆఫీస్ లో పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

కౌశిక్ రెడ్డితోపాటు హరీశ్ రావు, భారీగా బిఆర్ఎస్ నాయకులు సీపీ ఆఫీస్ కు వెళ్లారు. దీంతో హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను సైబరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గులాబీ నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని.. ఏసీపీ,సీఐను సస్పెండ్ చేయాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News