Tuesday, May 14, 2024

నేడు సిఎం కెసిఆర్ దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లి

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లి కూతురైంది
నేడు రంగారెడ్డి జిల్లా పాటిగడ్డలో ఉదయం 10 గంటలకు పెళ్లి
ప్టటువస్త్రాలు, డైమండ్ నక్లెస్‌తో ప్రత్యూషను పెళ్లికూతుర్ని చేసిన కెసిఆర్ సతీమణి శోభమ్మ

KCR Adopted daughter Pratyusha Marriage on Tomorrow

మనతెలంగాణ/హైఐదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శోభమ్మ దంపతుల దత్తపుత్రిక ప్రత్యూషను శోభమ్మ పెళ్లికూతురుని చేశారు. సోమవారం చరణ్‌తో ప్రత్యూష పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఆదివారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఎఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను శోభమ్మ పళ్లికూతురుని చేశారు. దత్తపుత్రిక ప్రత్యూషకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి శోభమ్మ డైమెండ్ నక్లెస్, పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించారు. సంప్రదాయ పద్దతిలో పెద్దలు ప్రత్యూషను ఆశీర్వదించి పెళ్లికూతురుని చేశారు. రాంనగర్‌కు చెందిన ఉడుముల జైన్‌మేరీ, మర్రిరెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డితో ఈ పెళ్లి నిశ్చయించారు. క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు పాటిగడ్డ లూర్దుమాత ఆలయంలో పెళ్లి జరగనుంది. పెళ్లి కొడుకు అమ్మమ్మ గ్రామం పాటిగడ్డ కావడంతో అక్కడ ఈ పెళ్లి నిర్ణయించారు. సవతితల్లి,తండ్రి వేదింపులతో ఆసుపత్రిలో ఉన్న ప్రత్యూషను సిఎం కెసిఆర్ దత్తపుత్రికగా స్వీకరించి నర్సు ట్రైనింగ్ చేయించి ప్రత్యూషకు నచ్చిన వరుడితో పెళ్లి జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా అభివృద్ధి కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ పెళ్లికి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటుగా కుటుంబసభ్యులు జరై ఆశీర్వదిస్తారని ఈసందర్భంగా పెళ్లి కూతురు ప్రత్యూష చెప్పారు.

KCR Adopted daughter Pratyusha Marriage on Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News