Saturday, July 27, 2024

లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా ఖాన్విల్కర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఎం ఖాన్విల్కర్‌తో లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేయించినట్లు అధికారులు తెలిపారు. 66 ఏళ్ల జస్టిస్(రిటైర్డ్) ఖాన్విల్కర్ 2016 మే 13 నుంచి 2022 జూలై 29 వరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.

రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఒక కార్యక్రమంలో లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా ఖాన్విల్కర్‌తో రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఒక అధికార ప్రకటన ద్వారా తెలియవచ్చింది. జస్టిస్ (రిటైర్డ్) ఖాన్విల్కర్‌ను అవినీతి నిరోధక అంబుడ్స్‌మాన్ లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా క్రితం నెల నియమించారు. పినాకి చంద్ర ఘోస్ 2022 మే 27న రిటైరైన తరువాత సుమారు రెండు సంవత్సరాలకు ఈ నియామకం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News