Thursday, May 16, 2024

బెంగళూరు భేటీకి రండి: విపక్ష నేతలకు ఖర్గే ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బెంగళూరులో జులై 17-18 తేదీలలో జరిగే ప్రతిపక్షాల మలివిడత సమావేశానికి రావాలంటూ కాంగ్రెస అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనాయకులను ఆహ్వానించారు. ఈ మీరకు ఖర్గే ప్రతిపక్ష నేతలకు ఒక లేఖ పంపారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జూన్ 23న పాట్నాలో జరిగిన సమావేశానికి హాజరైన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా తన లేఖలో గుర్తు చేశారు. ఆ సమావేశం ఘనవిజయం సాధించిందని, మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా పరిణమించిన వివిధ సమస్యలను మనం ఆ సమావేశంలో చర్చి తదుపరి సార్వత్రిక ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవడంపై ఒక ఏకాభిప్రాయానికి రాగలిగామని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.జులైలో మరోసారి సమావేశం కావడానికి అంగీకరించిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు.

ఈ చర్చలు కొనసాగి ఐక్యతాచర్యలు మరింత బలోపేతం కావలసిన అవసరం ఉందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి అందరం కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. బెంగళూరులో జులై 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగే సమావేశంలో తప్పకుండా పల్గొనాలని ఆయన ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు. జులై 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సమావేశం తిరిగి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News