Sunday, April 28, 2024

దుబాయ్‌లో ‘ఖిలాడి’

- Advertisement -
- Advertisement -

'Khiladi' movie team in Dubai

 

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రయూనిట్ దుబాయ్‌లో ఉంది. రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలపై అందమైన పాటను చిత్రీకరిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరచిన ట్యూన్‌కు యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. శుక్రవారం ఈ పాట చిత్రీకరణ ప్రారంభమైంది. దుబాయ్‌తో పాటు మస్కట్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News