Tuesday, May 7, 2024

అల్ట్రా స్టైలిష్ లుక్‌లో…

- Advertisement -
- Advertisement -

‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరవాత హీరో రవితేజ, సెన్సేషనల్ హిట్ ‘రాక్షసుడు’ తర్వాత దర్శకుడు రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ సమర్పణలో సినిమాను ఎ స్టూడియోస్, హవీష్ ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మాత కోనేరు సత్యనారాయణ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ కపాడియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుందని వెల్లడిస్తూ చిత్రయూనిట్ ‘ఖిలాడి’ సినిమాలోని రవితేజ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో స్పోర్ట్ బైక్‌పై అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో అదిరిపోయేలా కనిపిస్తున్నాడు రవితేజ. అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ ముందే ఇటలీలో ఓ భారీ షెడ్యూల్‌ను ‘ఖిలాడి’ చిత్రయూనిట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన విషయం తెలిసిందే.

Khiladi New Poster released

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News