Saturday, April 27, 2024

70 ఏళ్లలో తొలి యూకె రాజుగా మూడో చార్లెస్ పట్టాభిషేకం

- Advertisement -
- Advertisement -

ఇంగ్లాండ్: 1,000 సంవత్సరాల చరిత్ర , సంప్రదాయంతో నిండిన గంభీరమైన క్రైస్తవ క్రతువులతో మూడో చార్లెస్ యునైడ్ కింగడమ్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే  21వ శతాబ్దపు బ్రిటన్‌ను ప్రతిబింబించేలా రాచరికాన్ని స్వీకరించాడు. సెయింట్ ఎడ్వర్డ్స్ క్రౌన్ పాలన కాలంలో ఒక్కసారి మాత్రం ఉపయోగించిన బంగారు, పవిత్ర చిహ్నం గ్రీన్విచ్ మీన్ టైమ్ ఉదయం 11.00 గంటలకు ఆయన తలపై తాపారు. ‘రాజును దైవం రక్షించుగాక’ అన్న నినాదాలు ప్రజలు చేశారు. వెస్ట్ మినిష్టర్ అబ్బే వద్ద బూరలు ఊదారు, తుపాకీ వందనం చేశారు. 1953 తర్వాత బ్రిటిష్ రాజుగా, 1838 తర్వాత ఐదో రాజుగా చార్లెస్ పట్టాభిషిక్తుడయ్యాడు. చర్చీలలో గంటలు మోగాయి. 7000 పదాతి దళం, అశ్విక దళం కవాతు నిర్వహించారు.  1937 తర్వాత రాజు పట్టాభిషేకం కావడం ఇదే మొదటిది. టెలివిజన్‌లో ప్రసారం కావడం రెండోది. కలర్‌లో ఆన్‌లైన్‌లో ప్రసారం కావడం మొదటిది. చార్లెస్ పట్టాభిషేకానికి ఇది మతపరమైన ధృవీకరణ. 1937 తర్వాత రాజు పట్టాభిషేకం కావడం ఇదే మొదటిది. టెలివిజన్‌లో ప్రసారం కావడం రెండోది. కలర్‌లో ఆన్‌లైన్‌లో ప్రసారం కావడం మొదటిది. చార్లెస్ పట్టాభిషేకానికి ఇది మతపరమైన ధృవీకరణ.

74 చార్లెస్ తన తల్లి రెండో ఎలిజబెత్ మరణానంతరం ఏడు దశాబ్దాల తర్వాత వారసుడిగా రాజయ్యాడు. క్యాంటెన్‌బరి ఆర్చ్‌బిషప్ జస్టిన్ వెల్బీ రెండు గంటల ఆంగ్లికన్ సర్వీసులో పట్టాభిషిక్తుడయ్యాడు. 1066 నుంచి వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో పట్టాభిషేకం చేయబడిన 39వ రాజుగా గుర్తించబడ్డాడు. పట్టాభిషేకంలో తొలిసారి మహిళా బిషప్‌లు కూడా పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధాని రిషీ సునక్ పట్టాభిషేకాన్ని ప్రశంసించారు. అయితే రిపబ్లికన్‌లు ‘నాట్ మై కింగ్’ అంటూ నిరసన తెలిపారు. వారు దేశానికి ఎన్నికైన వ్యక్తి అధిపతిగా ఉండాలని కోరుకుంటున్నారు. యునైడ్ కింగడమ్ రాజు పట్టాభిషేకానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చారు.

ఈ పట్టాభిషేకం మూడు రోజుల వేడుక. ఆదివారం సాయంత్రం లండన్ పశ్చిమాన విండ్సర్ కాజిల్‌లో కచేరీ కూడా ఉంటుంది.

Duke-of-Sussex

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News