Sunday, April 28, 2024

రియల్ ఎస్టేట్ వాపారిపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

Knife attack on real estate trader

మనతెలంగాణ, సిటిబ్యూరోః రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. జూబ్లీహిల్స్ రోడ్డునంబర్ 78లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రవీందర్ రెడ్డి కుటుంబంతో ఉంటున్నాడు. అయితే గత కొంత కాలం నుంచి రవీందర్ రెడ్డికి తన బంధువు మోహన్‌రెడ్డికి మధ్య వ్యాపార లావాదేవీల్లో తేడా రావడంతో గొడవలు జరుగుతున్నాయి. బేగంపేట ప్రాంతంలో విక్రయించిన స్థలానికి సంబంధించిన కమీషన్ రూ.6లక్షలు విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డిపై దాడి చేశాడు. దాడిలో రవీందర్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దాడికి పాల్పడ్డ మోహన్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News