Sunday, April 28, 2024

రహానె గొప్ప సహచరుడు: విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

చెన్నై: టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానెపై విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. రహానెలాంటి సహచరుడు దొరకడం తన అదృష్టమన్నాడు. రహానెతో తనకు మంచి అనుబంధం ఉందన్నాడు. మైదానంలో అతను అందించే సలహాలు తనకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నాడు. తాను లేకున్నా ఆస్ట్రేలియాలో అతను జట్టును నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ఏ బాధ్యతలు అప్పగించినా దాన్ని అంకితభావంతో నెరవేర్చుతాడని ప్రశంసించాడు. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్ తమకు చాలా కీలకమన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడమే లక్షంగా పెట్టుకున్నామన్నాడు. శుక్రవారం ఇంగ్లండ్‌తో ఆరంభమయ్యే తొలి టెస్టును పురస్కరించుకుని టీమిండియా కెప్టెన్ కోహ్లి మీడియా సమావేశంలో మాట్లాడాడు.

Kohli interview ahead of first test against Eng

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News