Thursday, February 9, 2023

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం: మంత్రి కొప్పుల

- Advertisement -

మన తెలంగాణ/ధర్మారం: మండలంలోని నంది మేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన కెనాల్ నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, సాగునీరు లేక ఎడారిగా మారిందని, రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆకుపచ్చ తెలంగాణగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

నూతన కెనాల్‌కు రూ.12.14 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కెనాల్ ద్వారా సుమారు 20 గ్రామాల్లోని 9,800 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానున్నదని మంత్రి అన్నారు. ఇప్పటికే కెనాల్ నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి, భూమి కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించామని తెలిపారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నీటి కష్టాలను దూరం చేశారన్నారు. విద్యుత్ విషయంలో కూడా అద్భుతమైన ప్రగతిని, తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు.

కొప్పుడు వ్యవసాయం లేని తెలంగాణలో, ప్రస్తుతం సాగు రంగంలో దేశంలోనే ఒక ప్రత్యేకత సాధించిందని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలోపు ఈ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి, రైతులకు సాగునీరు అందించడం కోసం కృషి చేస్తామని ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ సత్యారాజ్‌చంద్ర, ఈఈ ప్రసాద్, డీఈ కుమార్, సింగిల్ విండో చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ సామంతుల జానకి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles