Sunday, August 10, 2025

బిసిలను నమ్మించి మోసం చేశారు: కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మించి మోసం చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొప్పుల మాట్లాడుతూ 42% రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేనిదని, అది కేంద్ర పరిధిలోని అంశమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్ లో చేరిస్తేనే అమలవుతుందన్నారు. రిజర్వేషన్ల ఆశ కల్పించి బిసి ల ఓట్లు కొల్లగొట్టడం కోసమే శాసనసభ తీర్మానం, మంత్రి వర్గ సమావేశము, ఆర్డినేన్స్ తెచ్చినట్లు డ్రామా చేశారన్నారు. ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించరని తెలిసి కూడా దానిని గవర్నర్ కు పంపడం చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు.

రాష్ట్రపతి ఆమోదం లభించని పరిస్థితి అందరికి తెలుసు అయినా మేము ప్రయత్నం చేశామని చెప్పుకునేందుకే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీ లో ధర్నా డ్రామా ఆడారని కొప్పుల విమర్శించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బి సి రిజర్వేషన్ సాధిస్తామని చెప్పకనే చెప్పారన్నారు. బిసిల కోసం బిఆర్‌ఏస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. బి సి రిజర్వేషన్ ఫై బి ఆర్ యస్ పార్టీ ఈ నెల 14నాడు కరీంనగర్ లో నిర్వహిస్తున్న సమావేశముకు కేటీఆర్ రానున్నారని జగిత్యాల జిల్లా నుండి వేలాదిగా తరలి వెళ్ళనున్నామని తెలిపారు. వర్షాలు లేవు, రిజర్వాయర్ల లో నీళ్లు అడుగంటిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సాగు నీరందక, కరెంట్ లేక, యూరియా దొరకక రైతాంగం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించామని, రైతు బంధు, రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. ఈ ఈ ఏడాది 600మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మిడ్ మానేరు, యల్ యం డి, మల్లన్న సాగర్, ఎస్సారెస్పీ రిజర్వాయర్ లో నీళ్లు లేవని పేర్కొన్నారు. ఇప్పటీకైనా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి తో పని చేసి అందరికీ న్యాయం చేయాలనీ ఆయన కోరారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News