Monday, June 24, 2024

డ్రగ్స్ కేసులో తెరపైకి క్రిష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయా లు బయటకు వస్తున్నాయి. ముందుగా అ నుమానించినట్లు బడా వ్యాపారులు, టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్, సినీనటుల పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా డైరెక్టర్ క్రిష్ ఈ డ్రగ్ పార్టీకి హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. రాడిసన్ హోటల్ డ్ర గ్స్ పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో మాదాపూర్ ఎస్‌ఓటి, గచ్చిబౌలి పోలీసులు దాడి చేశారు. కానీ అప్పటికే పోలీసులు వస్తున్నారనే సమాచారం రావడంతో పార్టీ చేసుకున్న వారు అక్కడి నుంచి పరారయ్యారు. హోటల్‌లోని రెండు రూముల్లో డ్రగ్స్ ఆనవాళ్లు పోలీసులకు లభించడంతో బిజెపి నాయకుడి కుమారుడు, రాడిసన్ హోటల్ యజమాని, మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానందను సోమవారం విచారించారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి లో కేధార్‌నాథ్, వివేకానంద్, నిర్భయ్‌కు డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వ చ్చింది. దీంతో ముగ్గురిని, వీరికి డ్రగ్స్ విక్రయించిన అలీ అబ్బాస్‌ను అరెస్టు చేశారు. వీరు మూడు రోజులుగా డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. రిమాండ్‌కు తరిలించిన ముగ్గురు యువకులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగతా వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్‌కు లింక్‌లు…
ఇలా ఉండాగా రాడిసన్ హోటల్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో పాల్గొని సినీ నటులు, డైరెక్టర్ అడ్డంగా బుక్కయ్యారు. డైరెక్టర్ క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. యూట్యూబర్ లిషి గణేష్ పేరు కూడా వినిపిస్తున్నది. డైరెక్టర్ క్రిష్, లిషి గణేష్‌ను కూడా పిలిచి విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. వివేకానంద్ నిర్వహించిన పార్టీలో క్రిష్, కేదార్, నిర్భయ్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్ పాల్గొన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే డైరెక్టర్ క్రిష్‌ను గచ్చిబౌలి పోలీసులు సంప్రదించారు. తాను హోటల్‌కు వచ్చి సాయంత్రం 6.30 గంటలకు ఇంటికి వెళ్లిపోయానని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. పోలీసుల విచారణకు సహకరిస్తానని క్రిష్ చెప్పినట్లు తెలిసింది. డ్రగ్స్ ఫెడ్లర్ అబ్బాస్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో డైరెక్టర్ క్రిష్ పేరు ఉన్నట్లు తెలిసింది. రా

డిసన్ హోటల్ యజమాని వివేకానంద ఇచ్చే పార్టీలకు క్రిష్ రెగ్యులర్‌గా వస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో డైరెక్టర్ క్రిష్ పేరు చేర్చారు. అయితే ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పరీక్షలు చేస్తే కానీ తెలియదు. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కేదార్ అలియాస్ కేదార్‌నాథ్ పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉండగా, సినిమా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వివేకానంద్, కేదార్‌నాథ్ మొబైల్ ఫోన్లను విశ్లేషిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కానీ వారు ముందుగానే ఫోన్లలోని డాటాను డిలీట్ చేశారని, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో ఆ సమాచారాన్ని రిమూవ్ చేస్తున్నట్టు తెలిపారు.

డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోందని మాదాపూర్ డిసిపి డాక్టర్ వినీత్ తెలిపారు. అబ్బాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. వివేకానందకు అబ్బాస్ ఇప్పటి వరకు 10సార్లు కొకైన్ విక్రయించినట్లు చెప్పాడని తెలిపారు. లిషి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారని, చరణ్ బెంగళూరులో ఉన్నాడని, డైరెక్టర్ క్రిష్ విచారణకు వస్తానని చెప్పాడని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News