Friday, May 3, 2024

ఎపి జలదోపిడీ నిజమే

- Advertisement -
- Advertisement -

పోతిరెడ్డిపాడు నుంచి కేటాయింపులకు అదనంగా తోడుకుంటున్న వైనం
స్వయంగా ప్రకటించిన కృష్ణా నది యాజమాన్య బోర్డు
వివాదాలకు తావివ్వకుండా నిబంధనల మేరకు వాడుకోవాలని ఎపికి బోర్డు హితవు
కేటాయింపుల కన్నా తెలంగాణకు తక్కువగా నీటి విడుదల

Krishna board respond on Pothireddypadu issue

మన తెలంగాణ/హైదరాబాద్: కేటాయింపులకంటే అధికంగా కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ వినియోగిస్తోందని కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఆక్షేపించింది. తెలంగాణ రాష్ట్రం కేటాయింపులకంటే తక్కువగా ఉపయోగిస్తూ నీటివాటాలను సమర్థవం తంగా వినియోగించుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా ప్రాజెక్టుల్లోంచి అధికంగా నీటిని తోడుకుంటుందని బోర్డు పేర్కొంది. వివాదాలకు, ఆరోపణలకు తావివ్వకుండా ఆంధ్ర నింబంధనల మేరకు నీటిని ప్రాజెక్టులనుంచి తోడుకోవాలని సూచించింది. ఆగస్టు 5న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పోతిరెడ్డి పాడుకు 9టిఎంసిల విడుదలకు అ నుమతి ఇస్తే 9.517 టిఎంసిల నీటిని విడుదల చేసిందని కృష్ణానదీ యాజమాన్యం బోర్డు స్పష్టం చేసింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడుకు .517 టిఎంసిలు అధికంగా విడుదల చేసిందని తెలిపింది.

ఆంధ్ర ఇప్పటికైనా కేటాయింపుల మేరకే నీటిని వినియోగించుకోవాలని కృషా ్ణనదీ యాజమాన్యం చెప్పింది. అలాగే ఇతరప్రాజెక్టుల వ్యవహారం కూడా ఇలాగా ఉందని పేర్కొంది. నాగార్జున సాగర్ నుంచి ఆగస్టు 10వరకు 4.286 టిఎంసిలను ఆంధ్ర వినియోగించిందని పేర్కొంది. అయితే నిబంధనలమేరకు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ .121 టిఎంసిల నీటిని అధికంగా వినియోగించిందని బోర్డు తెలిపింది. తెలంగాణ నాగార్జునసాగర్ నుంచి కేటాయింపుల కంటే తక్కువగానే విడుదల చేసిందని కృష్ణానదీ యాజమాన్యంబోర్డు తెలిపింది. కేటాయింపులకు భంగం కలకుండా ఆంధ్రవ్యవహరించాలని బోర్డు కోరింది.

Krishna board respond on Pothireddypadu issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News