Sunday, April 28, 2024

పరమహంసగా కృష్ణంరాజు

- Advertisement -
- Advertisement -

Krishna Raju in the role of Paramahamsa

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్. టీ సిరీస్ ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ పతాకంపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వర్షన్‌కి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులు, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ఒక పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పరమహంస పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కృష్ణంరాజు కాషాయ వస్త్రాలు ధరించి ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News