Tuesday, April 30, 2024

ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్.. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: మహిళ ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కెఎస్ఆర్ టిసి కండక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 15న కెఎస్ఆర్ టిసి బస్సులో యశ్వంత్ పూర్ నుంచి హాసన్ వరకు వెళ్తున్న ఓ యువతి(21) పట్ల 33ఏళ్ల కండక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ యువతి ప్రక్కన కూర్చుని కామంతో ఆమెను తాకడం మొదలుపెట్టాడు. కండక్టర్ వికృత చేష్టలను బాధితురాలు తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించింది. కండక్టర్ ప్రవర్తన మితిమీరడంతో ఆమె కోపంతో రెచ్చిపోయి కండక్టర్ చెంప చెల్లుమనిపించింది. తర్వాత  బేలూరు క్రాస్ వద్ద బస్సు దిగి వేరే బస్సులో వెళ్లిపోయింది. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆ వీడియోని తీసుకొని సుబ్రమణ్యం నగర్ లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సదరు కండక్టర్ పై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Credited by one india

KSRTC Conductor misbehaved on woman Passenger

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News