Sunday, April 28, 2024

ఏడాదిన్నరలో తిరగరాస్తాం: ట్విట్టర్ సవాల్‌ను స్వీకరించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Accepted Manipal University Chairman Challenge

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో పోషకాహార లోపంపై ఉన్న గణాంకాలను రానున్న 18 నెలల్లో తిరగ రాస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ పోషకాహారలోపంపై కెటిఆర్ ట్వీట్‌కు స్పందిస్తూ మణిపాల్ యూనివర్సిటీ చైర్మన్ మోహన్ దాస్ సవాల్ విసిరారు. చాలాకాలంగా తెలంగాణను పాలిస్తున్నారు కదా మీ రాష్ట్రంలో పోషకాహారలోప గణాంకాలు ఎలా ఉన్నాయో చూపించండి అంటూ మోహన్‌దాస్ ఛాలెంజ్ విసిరారు. దీనికి స్పందించిన మంత్రి ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ.. ‘నా మాటలు గుర్తుంచుకోండి.. కర్ణాటకలోని 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని, గుజరాత్‌లో రేపిస్టు ఉపశమన ప్రభుత్వాలను అధిగమిస్తామని కెటిఆర్ ట్వీట్ చేశారు.

కాగా,  తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ఈ ఏడాది చివర్లోగా ప్రారంభిస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. స్మారకం సిద్ధమవుతోందని కెటిఆర్ ట్వీట్ చేశారు. సచివాలయం ఎదుట లుంబినీ పార్కు పక్కన విశాలంగా అమరవీరుల స్మారకాన్ని నిర్మిస్తున్నారు. ప్రధాన పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రస్తుతం స్టీల్ క్లాడింగ్ పనులు కొనసాగుతున్నాయి. అనంతరం వెల్డింగ్ సహా ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉంది. అమరులకు ఎల్లప్పటికీ రుణపడి ఉంటామని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

KTR Accepted Manipal University Chairman Challenge

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News